Suryaa.co.in

Andhra Pradesh

నిబంధనలు లేవు అంటూనే ఎన్నో నిబంధనలు

– వినాయక చవితి మండపాల విషయంలో ప్రభుత్వంపై ఫైర్ అయిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

విజయవాడ: ఫైర్,విద్యుత్,పోలీస్ పర్మిషన్స్ తీసుకోవాలని చెబుతున్నారు… ఇవి నిబంధనలు కావా?హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఆ వేడుకలు చూసేందుకు ఎక్కడెక్కడ నుండో ప్రజలు తరలి వస్తారు.ఏపీ సీఎం అక్కడికి వెళ్లి అందులో పాల్గొంటే అప్పుడు ఆ ప్రాముఖ్యత తెలుస్తుంది.

ఇక్కడ పెట్టిన నిబంధనలు అన్నీ వెంటనే తొలగించాలి. నిబంధనలు లేవు అంటూనే ఎన్నో నిబంధనలు పెట్టారు.నిబంధనల పేరుతో పండుగని అడ్డుకోవాలంటే బిజెపి చూస్తూ ఊరుకోదు.రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ నిబంధనలు ఏమీ పట్టించుకోవద్దు.రాజమండ్రిలో వినాయక చవితి వేడుకల్లో నేను పాల్గొంటాను.దానికి ఎలాంటి అనుమతులు తీసుకోను. దమ్ముంటే నన్ను అడ్డుకోండి, అరెస్ట్ చేయండి.

LEAVE A RESPONSE