తొలి కిరణమా.. కిరణ చరణమా
నిను తాకి పులకించే ఓ భువనమా
చిరు పవనమా ..తరు మిత్రమా ..
మేఘాలలో కలిగే ఆనందమా
ఉషోదయాల సంబరమా
వర్ణోదయాల అంబరమా
ఆ దేవదేవుని చీనాంబరమా ..
శూన్యానికే ఆడంబరమా ..
ఏ చిత్ర కారుని కళాత్మికమా
ఏ కుంచె గీసిన అద్భుత చిత్రమా
ఏ కవి రాయలేని కావ్య చైతన్యమా
ఏ హృదయాల లయల సంధ్యా రాగమా!
– రాధిక ఆండ్ర