ఎస్పీ సిగ్గుతో తలదించుకోవాలి

0
117

-రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తుంటే చర్యలు తీసుకునే సత్తా లేని జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే
– దళితుడి ప్రాణాలు బలితీసుకున్న ఎస్సై కరిముల్లాపై చర్యలు తీసుకునే దమ్ములేని జిల్లా ఎస్పీ సిగ్గుతో తలదించుకోవాలి
– పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఆ ఎస్సైని పెంచిపోషిస్తున్న కాకాణి ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రిపదవికి రాజీనామా చేయాలి
– మీ పోలీసులు కొట్టిన దెబ్బలు కనిపిస్తాయని కుల, కుటుంబ సంప్రదాయాలకు విరుద్ధంగా బందోబస్తు మధ్య బలవంతంగా నారాయణ మృతదేహాన్ని దహనం చేయిస్తారా?
– నెల్లూరు రూరల్ మండలం కందమూరులో మీడియాతో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యేలు పరసా వెంకటరత్నం, పాశం సునీల్ కుమార్, టీడీపీ నెల్లూరు సిటీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, తాళ్లపాక అనూరాధ, జలదంకి సుధాకర్, మాతంగి క్రిష్ణ తదితరులతో కలిసి నారాయణ కుటుంబసభ్యులను పరామర్శించిన సోమిరెడ్డి. ఈ సందర్భంగా సోమిరెడ్డి ఏమన్నారంటే…

పోలీసులు కొట్టిన దెబ్బలతో ఉదయగిరి నారాయణ ప్రాణాలు కోల్పోవడంతో ఆయన భార్య, ముగ్గురు చిన్నపిల్లలు, దివ్యాంగురాలైన నారాయణ సోదరి దిక్కులేనివారయ్యారు..వారిని చూస్తే మనస్సు కలచివేస్తోంది.నారాయణను కొట్టి చంపేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది..పోస్టుమార్టం నివేదిక బయటకు వస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.పొదలకూరు పోలీసు స్టేషన్ లో దుర్మార్గుడిగా వ్యవహరిస్తున్న ఎస్సైsomireddy కరిముల్లా కొట్టిన దెబ్బలతోనే నారాయణ ప్రాణాలు కోల్పోయాడు.కరీముల్లా పనిచేసిన ప్రతి చోటా ఇలాగే దుర్మార్గాలకు పాల్పడుతున్నా ఆయనపై చర్యలు తీసుకునే దమ్ము జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు లేకుండాపోయింది.అక్రమ కేసులు బనాయించినా, కేసుల పేరుతో అమాయకులను హింసిస్తున్నా, చివరకు ప్రాణాలు బలితీసుకుంటున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం అన్యాయం.

గోవర్ధన్ రెడ్డి అండదండలతోనే ఎస్సై కరిముల్లా అరాచకలకు పాల్పడుతున్నాడు. కాకాణిలో కొంచెం మానవత్వం, నిజాయితీ ఉన్నా…తాను పెంచి పోషించిన ఎస్సై కరిముల్లా కారణంగా ఒక అమాయక దళితుడు చనిపోయినందుకు బాధ్యత వహించాలి.ఈ మూడేళ్లలో కాకాణి ఆధ్వర్యంలో జరిగిన అరాచకాలు, విధ్వంసాలకు నారాయణ ప్రాణాలు బలితీసుకోవడం పరాకాష్ట….త్వరలోనే మీ దుర్మార్గాల చరిత్రను భారీ ఫ్లెక్సీల రూపంలో బహిర్గతం చేస్తాం. ఉరికి వేలాడుతున్న నారాయణ మృతదేహాన్ని కుటుంబసభ్యులు, బంధుమిత్రులు చూడకుండా అడ్డుకున్నారు..పోలీసులు కొట్టిన గాయాలు కనిపిస్తాయనే అలా వ్యవహరించారు.నిన్న పోస్టుమార్టం అయిన తర్వాత 40 మంది పోలీసులు వచ్చి బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసి వారి సంప్రదాయనికి విరుద్ధంగా పూడ్చిపెట్టడానికి బదులు మృతదేహాన్ని దహనం చేయించివెళ్లారు.

కుల, కుటుంబ ఆచారం ప్రకారం పూడ్చిపెట్టడానికి తీసుకెళ్తే పోలీసులు కొట్టిన దెబ్బలు కనిపిస్తాయనే బలవంతంగా దహనం చేయించారు.అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.ఎస్సై కరిముల్లా ఒక అధికారిగా కాకుండా కాకాణికి అనుచరుడిగా వ్యవహరిస్తూ అమయాకులను హింసిస్తాడు..పోలీసు సైరన్ వేసుకుని తిరుగుతూ ఆస్తులు ధ్వంసం చేయిస్తాడు. అతడి నోటి నుంచి వచ్చే భాషను చూసి ప్రజలు జడుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది… కుటుంబసభ్యులను, తల్లులను, భార్యలను కూడా తిడుతూ మానసికంగా వేధిస్తున్నాడు.పది రోజుల క్రితమే పొదలకూరు మండలానికి చెందిన పలువురు వెళ్లి సీఐని కలిసి కరిముల్లా వాడుతున్న భాష గురించి ఫిర్యాదు కూడా చేసివచ్చారు.

ఇది జరిగిన వారం రోజులకే అదే ఎస్సై కరిముల్లా అమాయకుడైనా నారాయణ ప్రాణాలను బలితీసుకున్నాడు.ప్రజలకు రక్షకులుగా వ్యవహరించాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే ఎలా?ఇంత జరుగుతున్నా ఆ ఎస్సైపై ఎలాంటి చర్యలు తీసుకోలేని జిల్లా ఎస్పీ సిగ్గుతో తలదించుకోవాలి.ప్రజల డబ్బులు జీతాలుగా తీసుకోవడంతో పాటు లంచాలతో మీ కుటుంబం కోసం మీరు కోట్లు ఆర్జిస్తున్న సంగతి అందరికీ తెలుసు.మా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో…నారాయణ బిడ్డల ఉసురు మీకందరికి తగలక తప్పదు.