Suryaa.co.in

National

భారత ఇంజనీర్ల విశేష ప్రతిభ

పర్వతాలను చీల్చి 12 సొరంగాలు

జమ్మూలోని ఉదంపూర్ – కాశ్మీర్ లోయలోని శ్రీనగర్ – బారాముల్లాను కలుపుతూ చేపడుతున్న రైలు లింక్ (USBRL) పనులు భారత ఉపఖండంలోనే ప్రతిష్టాత్మకమైనవి. కాశ్మీర్ ను – కన్యాకుమారితో రైలు మార్గంతో అనుసంధానించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం చేస్తున్న మహా ప్రయత్నమిది.

272 కి.మీ కలిగిన ఈ ప్రాజెక్టు రూ. 37,012 కోట్ల బడ్జెట్‌ను కలిగి ఉన్నది. ఈ రైల్వే లింక్‌పై రూ 15,863 కోట్లతో నిర్మించిన బనిహాల్ – ఖారీ – సంబర్ – సంగల్దాన్ సెక్షన్‌( 48 కిమీలు)ను గత నెల 20వతేదిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారు ప్రారంభించారు.

వినటానికి 48 కిమీలే అయినప్పటికీ ఈ మార్గంలో పర్వతాలను చీల్చి నిర్మించిన 12 సొరంగ మార్గాల గురించి, అందులో మన దేశ ఇంజనీర్ల ప్రతిభ గురించి విశేషంగా చెప్పుకోవాలి.

ఈ సెక్షన్ లో T – 50 పిలువబడుతున్న సొరంగం (12.77 కిమీల) భారతదేశంలో అతి పెద్ద రైల్వే సొరంగ మార్గంగా నిలుస్తున్నది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, భూకంపాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా వీటి నిర్మాణం జరిగింది.

LEAVE A RESPONSE