– హైకోర్టులో బిగిసుకున్న అనర్హత కేసు
– 142 ఆస్తులను అఫడవిట్ లో చూపకుండా దాచిన పెద్దిరెడ్డి
– పూర్తి సాక్ష్యాధారాలతో హైకోర్టులో రామచంద్ర యాదవ్ పిటిషన్
ఆ 142 ఆస్తులు పూర్తిగా ఆధారాలున్నాయి..!
– మదనపల్లె రికార్డుల దహనం వెనుక కారణం ఈ కేసే..?
చిత్తూరు: మాజీ మంత్రి.. వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇక ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయే ప్రమాదాల్లో పడ్డారు. ఎన్నికల అఫడవిట్ లో ఆయన చూపని ఆస్తులను లెక్కకట్టి.. పక్కా ఆధారాలతో బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ ఇప్పుడు కీలక దశలో ఉంది.. బుధవారం హైకోర్టులో ఈ కేసు విచారణకు జరిగింది.
ఇరు పక్షాల న్యాయవాదులు సహా, పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి కూడా వచ్చారు.. “పెద్దిరెడ్డి అనర్హుడిగా మారితే.. తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు.. ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే, ఆయనను కూడా విచారణలో భాగస్వామి చేస్తూ నోటీసులు ఇవ్వండి, ఇంప్లీడ్ చేయండి” అని హైకోర్టు ఆదేశించింది.. ఇది ఈ కేసులో కీలక పరిణామం.
ఈ పిటిషన్ వేసిన రామచంద్ర యాదవ్ పకడ్బందీగా వ్యవహరించారు.. తెరవెనుక వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అత్యంత కీలకమైన ఆధారాలు సేకరించారు. పెద్దిరెడ్డిని అనర్హుడిగా చేయాలంటే కావాల్సిన అన్ని రకాల ఆధారాలు సేకరించి, పెద్దిరెడ్డి తప్పించుకునే మరో దారి లేకుండా చేసి, కోర్టులో పిటిషన్ వేశారు.
అందుకే ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో ఎన్ని పిటిషన్లు దాఖలైన సీరియస్ గా తీసుకొని హైకోర్టు ఈ పిటిషన్ లో మాత్రం విషయం ఉండడంతో విచారణకు స్వీకరించి, ప్రతివాదులకు నోటీసులిచ్చి, ఈరోజు ఇంప్లీడ్ కూడా ఆదేశించింది.
“పెద్దిరెడ్డి అఫడవిట్ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన దాచిన ఆస్తులు చాలానే కనిపిస్తాయి. ఎవరూ ఏమి చేయలేరు, ఎవరూ అంత వరకు వెళ్ళలేరు, ఏదైనా చేసేయొచ్చు, ఎవర్నైనా మోసం చేసేయొచ్చు.. అనే ధీమాతో, మదంతో పెద్దిరెడ్డి అక్రమాస్తులను దాచి పెట్టారు.. ఈ పిటిషన్ లో మొత్తం ఆధారాలు అన్ని ఇచ్చాము, ఆస్తుల లెక్కలు, భూ రికార్డులు, వివరాలు అన్నీ ఇచ్చాము.. ఆ 142 భూ రికార్డులు పెద్దిరెడ్డి, ఆయన భార్య పేరిట ఉన్నవే.. అవేమి ఆయన అఫడవిట్ లో చూపించలేదు.
ఎప్పటికీ అన్యాయాన్ని గెలవనీయను.., అక్రమాలను సహించను, అరాచకాల్ని భరించను” అందుకే పెద్దిరెడ్డిపై అనర్హత వేటు పడినా నేను ఎమ్మెల్యే అవ్వను.. కానీ అక్కడ న్యాయం గెలవడం ముఖ్యం, అక్రమార్కుడు ఓటమి ముఖ్యం, పెద్దిరెడ్డి లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగానే కాదు, అసలు రాజకీయాల్లోనే ఉండకూడదు” అందుకే నా పోరాటం అని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.
ఈ కేసుని పూర్తిగా పరిశీలిస్తే దీనిలో పేర్కొన్న 142 అక్రమాస్తుల వివరాలు మదనపల్లె సబ్ కలెక్టరేట్ పరిధిలోనే ఉన్నాయి.. కోర్టు విషయాన్నీ సీరియస్ గా తీసుకోవడం, ఎన్నికల అధికారి కూడా కోర్టుకి వెళ్లి సమాధానం చెప్పుకోవడంతో కేసులో సీరియస్ అంశం, సంచలన అంశం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.