శ్రీలక్ష్మి గారు.. ఒకప్పుడు జగన్ గారి జైలు బ్యాచ్‌మేట్. తర్వాత జగన్ ప్రభుత్వంలో పదోన్నతి పొంది, ఆయన ఆదేశాల మేరకు రాజధాని అమరావతిని అంతు చూడడంలో తనవంతు పాత్ర పోషించారు.
ఇక తెలంగాణ హైకోర్టు సంగతికొస్తే… గతంలో గాలి జనార్ధన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కన్నూ మిన్నూ కానక చేసిన గనుల కేసులో.. శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించి, అభయమిచ్చింది. తీర్పు విని, ‘ఆహా! హైకోర్టు ఎంత మంచిదో!’ అనుకున్నారంతా. తీరా చూస్తే, సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీం ఆదేశించాక, తెలంగాణ హైకోర్టుకు హఠాత్తుగా మళ్ళీ “జ్ఞానోదయం” అయింది.
ఇప్పుడు ఏకంగా “శ్రీలక్ష్మి నిందితురాలే” అని తీర్పు చెప్పేసింది! నిన్నమొన్నటిదాకా నిర్దోషిని అని చెప్పిన కోర్టే, ఇప్పుడు నిందితురాలని అనడం చూస్తుంటే, హైకోర్టు కూడా అప్పుడప్పుడూ “ట్విస్ట్‌లు” ఇస్తుంటుందని అర్థమవుతోంది.
మొత్తానికి, శ్రీలక్ష్మి గారి కర్మ! ఈ కేసులో ఆమెకు “క్లీన్ చిట్” వచ్చి, సీబీఐ పట్టుబట్టడం, సుప్రీంకోర్టు గట్టిగా నిలబడటంతో, హైకోర్టు మళ్లీ విచారించి దోషిగా తేల్చింది.