Suryaa.co.in

Andhra Pradesh

కలెక్టర్ రంజిత్ బాషా పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశంసల జల్లు

కృష్ణాజిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ఓజీ) సాధనకు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా విజన్ అభినందించదగినదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కె. ఎస్. జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి.రంజిత్ బాషా పాల్గొన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ వివరించారు.

కలెక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ పై సీఎస్ స్పందిస్తూ జిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే రీతిని చక్కగా వివరించారని కలెక్టర్ ను అభినందించారు. ఎల్డీజీ లక్ష్యాల సాధనకు వ్యక్తిగత శ్రద్ధ కూడా అవసరమని తెలుపుతూ రాష్ట్రంలోని ఇతర జిల్లా కలెక్టర్లు సైతం దీనిని ఆదర్శంగా తీసుకొని అనుసరించడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు.సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై కలెక్టర్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ జిల్లాను ఎనీమియా రహితంగా మార్చేందుకు వైద్య, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామ సచివాలయ సిబ్బంది వివిధ పోర్టల్స్ ద్వారా డేటాను సేకరిస్తున్నప్పటికీ, గణాంకాల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని, ఇది ఆయా శాఖలు వివిధ పోర్టల్స్ను ఉపయోగించడం, ఒక శాఖ డేటా మరొక శాఖకు యాక్సెస్ లేకపోవడం వల్లనే జరుగుతందని వివరించారు.

దీనిని అధిగమించడానికి ఉమ్మడి పోర్టల్ ఏర్పాటు చేయడం ద్వారా వివిధ శాఖల సిబ్బంది. సేకరిస్తున్న డేటాను అందరూ పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా.సమీర్ శర్మ ఆదేశాల మేరకు 18 నుంచి 19 వయస్సు గల కిశోర బాలికలు అదేవిధంగా 15 నుంచి 49 వయస్సులోని గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను నివారించడానికి ఐరన్ ట్యాబ్లెట్స్ ను అందించడంతో పాటు వారికి అందించే ఆహారంలో బీట్రూట్, క్యారెట్లను చేర్చే విధంగా జిల్లాలోని సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో ఖరీఫ్ పంటకు సంబంధించిన 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా వరి కుప్పల మీదనే ఉందని తెలుపగా, సానుకూలంగా స్పందించిన సీఎస్ అందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కు హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE