– కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో భేటీ అయిన బిసివై అధినేత రామచంద్రయాదవ్
– విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లిన రామచంద్రయాదవ్
– ప్రైవేటీకరణ కాకుండా ఆపాలని వినతి
– రామచంద్రయాదవ్ విజ్ణప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి కుమారస్వామి
ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల తరుపున బిసివై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ పోరాటానికి సన్నద్దమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర ఉక్కుశాఖా మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దని విజ్ణప్తి చేశారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల మనోవేదనను వినతిపత్రం రూపంలో కుమారస్వామికి అందజేశారు. రామచంద్రయాదవ్ చేసిన విజ్ఞప్తికి మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. స్టీల్ ప్లాంట్ వద్ద జరుగుతున్న తాజా పరిణామాలతో పాటు ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై వివరాలు కావాలని ఆయన వెంటనే అధికారులను ఆదేశించారు