– బిజెపి జాతీయ వాదంతోనే నా నడక: మాధవ్
– కూటమిలో బలపడడం ఎలా?
– పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా ప్రతినిధులుగా మారాలి
( కె. మురళీ కృష్ణంరాజు)
విజయవాడ: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా పివిఎన్ మాధవ్ నియమితులైన తర్వాత వెంటనే తీసుకున్న నిర్ణయం సారధ్యం యాత్ర.. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో సారధ్యం అనే పేరు ఎందుకు పెట్టిన విషయాన్ని కూడా ప్రతి సమావేశంలో ప్రస్తావిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశానికి సారధ్యం వహిస్తూ, ప్రపంచ దేశాల ముందు భారత దేశానికి ఏవిధంగా పునర్ వైభం ఎలా తీసుకుని వస్తున్నారో, ఆవిధంగా నరేంద్రమోదీని ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పర్యటనకు సారధ్యం అని నామకరణ చేయడం జరిగిందని వివరిస్తూ కార్యకర్తలతో మమేకం అవుతున్నారు.
జిల్లా పర్యటనలో రోజంతా ఒక జిల్లా కేంద్రంలో నే కార్యక్రమాలు నిర్వహిస్తూ, పాత కొత్త తరాన్ని అనుసంధానిస్తూ పర్యటన కొనసాగిస్తున్నారు. అయా జిల్లాల్లో ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూల మాలలు వేయడం తో పాటు, ఛాయ్ పే చర్చ పేరుతో స్ధానిక సమస్యల ను నేరుగా ఆ ప్రాంత వాసుల నుండి తెలుసుకోవడం తో పాటు బిజెపి విధానం వారికి వివరిస్తున్నారు.
ప్రతి జిల్లాలో మేథావులతో సమావేశం అవుతున్నారు. వారి తో సంభాషించే సమయంలో వారి సందేహ నివృ తి చేస్తున్నారు. జిల్లాల వారీ సమస్యలు తెలుసుకోవడం తో పాటు పరిష్కార మార్గాలను కూడా అక్కడకక్కడే వివరిస్తున్నారు. కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర సమస్యలు ప్రస్తావిస్తునే పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న అంశాలను ప్రస్తావిస్తూ.. భవిష్యత్ లో బిజెపి శ్రేణులు ఏవిధంగా ఆలోచన చేయాలి అనే అంశాన్ని తప్పనిసరిగా చెభుతూ, కూటమి ప్రభుత్వోంలో పార్టీని బలోపేతం చేయడానికి ఏ అంశాలు ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశం పై వారికి దిశానిర్ధేశం చేస్తున్నారు.
ఇప్పటి వరకు సాంప్రదాయ కార్యక్రమాలు చేయడం ద్వారా, పార్టీ కార్యకలాపాలు చేస్తు వస్తున్న బిజెపి రాజకీయ కలాపాలు ఎలా ఉండాలన్న విషయంలో మాధవ్ క్లారీటి ఇస్తు వస్తున్నారు. ఇదే విషయంలో ప్రతి జిల్లా కార్యకర్తల సమావేశంలో తప్పకుండా చెబుతూ వస్తున్నారు.
జాతీయ పార్టీ ఇస్తున్న కార్యక్రమాలు , రాష్ట్ర కమిటీ ఇచ్చే కార్యక్రమాలతో నే పార్టీ పనిగా భావిస్తూ బిజెపి శ్రేణుల పని చేస్తున్నాయి. రాజకీయ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక గా ఉన్నసమయంలోనే పార్టీ గుర్తుకు ఓట్లు వస్తాయన్న విషయాన్ని చెప్పకనే చెబుతు వస్తున్నారు. జిల్లా పార్టీ కార్యాలయాలు, మండల పార్టీ కార్యాలయాలు ప్రజా సమస్యలు వేదికగా మార్చాలని వివరిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పధకాలు లబ్ధిదారు సమస్యలు పరిష్కారం చేయడానికి అనువుగా కార్యకలపాలు ఉండాలి. అందుకు అనుగుణంగా పార్టీ కార్యాలయాల్లో మౌలిక వసతులు పెంచుకోవలసిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర కార్యాలయం నుండి సహకారం ఉంటుందని వారికి భరోసా ఇస్తున్నారు.
బిజెపి లో నేతలకు పార్టీ పదవులు ఆశిస్తారు. లేదంటే నామినేటడ్ పోస్టులు అడిగే విధానం ఉంటుంది. దశాభ్థాలుగా ఇదే అనుసరిస్తు వస్తున్నారు. ఎవరైనా రాష్ట్ర స్ధాయి నేతలు వచ్చిన సందర్భంలో.. పరిచయ కార్యక్రమంలో ,తాము పార్టీ పని ఎప్పటి నుండి చేస్తున్నామో చెబుతు వస్తున్నారు. అయితే ఇందుకు భిన్నమైన కార్యచరణ ఇస్తున్నారు మాధవ్.
సర్పంచ్ లు, ఎంపిటిసి, జెడ్పిటిసి, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నిలతో పాటు రిజస్టర్ట్ సొసైటీ, నీటి సంఘాల ఎన్నికల్లో కమలం గుర్తు పై గెలిస్తే అ మజా వేరు అనే విషయాన్ని వారికి అర్ధం అయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
బిజెపి జెండా మోయడంతో తోపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుండి పోటీ చేయాలనుకున్న ప్రాంతాల్లో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలని, జిల్లా స్ధాయి నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. కూటమిలో పార్టీ బలపడడం అంటే, ఎన్నికల్లో పోటీ చేయడం అనే విషయం వారికి చెబుతూ వస్తున్నారు.
ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సింధూర్ లను ప్రస్తావిస్తూ.. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వల్ల దేశానికి ఎంత మంచి జరుగుతోంది అనేవిషయం చెబుతూ, దేవాలయాల్లో అన్నమతస్థుల విషయంలో పార్టీ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతూ వస్తున్నారు.
రాజకీయ పార్టీ కి ఎన్నికలే గీటురాయి. ఆ విధంగా మనం పనిచేయాలన్న విషయాన్ని వివరిస్తూనే.. పోలవరం వంటి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా పార్టీ ఏవిధంగా ఉంటుందన్న విషయాన్ని స్నేహపూర్వకంగా వివరిస్తున్నారు.
ప్రతి జిల్లాలోను వేలమంది కాషాయ దండుతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూనే, పాతతర కార్యకర్తలను, జాతీయ వాదులను వ్యక్తిగతంగా కలుస్తు పార్టీ జెండాను భుజాన వేసుకున్న మాధవ్ .. ఇప్పటి వరకు రాయలసీమ,ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన విజయవతంగా పూర్తి చేశారు.
ఇక తొమ్మిది జిల్లాల్లో పర్యటన చేయాల్సి ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు తేదీలు ఖరారు చేశారు సెప్టంబర్ తొమ్మిదివ తేదీతో సారథ్యం యాత్ర ముగిస్తుంది.
(రచయిత సీనియర్ జర్నలిస్ట్)