Suryaa.co.in

International National Telangana

భారతదేశ శీఘ్రప్రగతికి ఇన్నోవేషన్ రంగం బలోపేతమే సత్వరమార్గం

-దావోస్ లో భారతదేశ ఇన్నోవేషన్ రంగంపై జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న మంత్రి కేటీఆర్

భారతదేశం స్టార్టప్ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిన ప్రముఖ కంపెనీల స్థాపకులతో మంత్రి కే. తారక రామారావు చర్చగోష్ఠి లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో స్టార్ట్ అప్ ఈకొ సిస్టమ్ బలోపేతానికి సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి సాధించాలంటే దేశంలో ఇన్నోవేషన్ కల్చర్ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నోవేషన్ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానమే కాకుండా మానవ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి మొదలుకొని మున్సిపాలిటీ, గ్రామాల సమస్యలకు సైతం పరిష్కారాలు ఇవ్వగలిగే శక్తి ఉండాలన్నారు. ఇన్నోవేషన్ ద్వారా అద్భుతమైన వ్యాపార వాణిజ్య అవకాశాలతో పాటు సమాజం ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకే భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను దాటుకొని వేగంగా ముందుకు పోవాలంటే ఇన్నోవేట్, ఇంకుబెట్, ఇంకర్పెట్ 3ఐ (3i) మంత్రానే మార్గం అన్నారు. హైదరాబాద్ నగరంలో ఇన్నోవేషన్ ను మరింతగా పెంచేందుకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
ఆ దిశగా ప్రభుత్వం ఒక ఎనేబులర్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు.

తాము నమ్మిన ఆలోచనను పట్టుకొని తమ స్టార్ట్ అప్ కోసం నిబద్ధతతో సంవత్సరాల తరబడి పని చేయడం ఒక అద్భుతమైన పని అని కేటీఆర్ అన్నారు.100% స్టార్ట్ అప్ లలో 95% విఫలం అయ్యే అవకాశం ఉన్నా, నూతన ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. అందుకే ప్రభుత్వం ఇన్నోవేషన్ రంగానికి నిరంతరం సహకారం అందిస్తూనే ఉండాలన్నారు.ఈ దిశగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంకుబేటర్ టి హబ్ నిర్మాణంతోపాటు అనేక ఇతర కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ద్వారా బడి పిల్లల వయసు నుంచే ఇన్నోవేషన్ పైన అవగాహన కల్పించడం, టాలెంట్ ఉన్న విద్యార్థులకు సహకారం అందించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ రంగాన్ని బలోపేతం చేసేందుకు మేము చేపట్టిన ప్రయత్నాలు, ఇప్పటికే ఫలితాలు ఇవ్వడం ప్రారంభమయ్యాయని, హైదరబాద్ కేంద్రంగా వేదికగా స్టార్ట్ అప్స్ అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.మా ప్రభుత్వం చేపట్టిన ఇన్నోవేషన్ ఎనేబిల్లింగ్ కార్యక్రమాల వలన భవిష్యత్తులో హైదరాబాద్ స్టార్టప్లకు రాజధానిగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చర్చాగోష్టిలో Ease my trip- ప్రశాంత్ పిట్టి, Meesho – విధిత్ ఆత్రే, Builder.ai- సచిన్ దేవ్ దుగ్గల్, Zerodha- నిఖిల్ కామత్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్నోవేషన్ రంగం మరియు భవిష్యత్తు, శవాల పైన వీరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత దేశం వైపు చూస్తున్నది అని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇన్నోవేషన్ అనుకూల ఈకో సిస్టమ్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం ఆర్థిక అభివృద్ధి స్థూల దేశీయ ఉత్పత్తి పవర్ క్యాపిట ఇన్ కమ్ వంటి అంశాల పైన దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వాలు మారినా కనీసం ఒకటి రెండు దశాబ్దాల పాటు ఇన్నోవేషన్ రంగంపైన పాలసీ స్థిరత్వం ఉండాలని అభిప్రాయపడ్డారు. రానున్న దశాబ్దం భారతదేశ భవిష్యత్తును మార్చే దిశగా ఉండబోతోందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.చర్చలో పాల్గొన్న యునికార్న్ కంపెనీల వ్యవస్థాపకుల అనుభవాలు, వారి నిబద్ధతను మంత్రి కేటీఆర్ అభినందించారు. వీరి విజయగాథలు దేశంలోని ఔత్సాహిక యువకులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

LEAVE A RESPONSE