– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవాపక్షం కార్యక్రమాల్లో భాగంగా, హైదరాబాద్ చార్మినార్ నియోజకవర్గంలోని హుస్సేని ఆలం ప్రాంతంలో ఉన్న ఆర్హెచ్వీ కాన్సెప్ట్ స్కూల్లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రా మ్చందర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించి, వారిలో సేవా భావన, విద్యాపట్ల కట్టుబాటు, సమాజ పట్ల బాధ్యత గల పౌరులుగా ఎదగాలనే సందేశాన్ని ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఉమామహేందర్, పాండు యాదవ్, మేఘ రాణి, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.