Suryaa.co.in

Andhra Pradesh

సునీల్‌యాదవ్‌ తల్లిని వివేకా లైంగికంగా వేధించారు

-అందుకే వివేకాను సునీల్‌ హత్య చేశారన్న న్యాయవాది
-గూగుల్ టెక్ ఔట్‌‌ను ఆధారంగా చేసుకొని ఎలా కేసులో పెడతారు?
-వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్‌

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడని భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది పేర్కొన్నారు.

దస్తగిరి అప్రూవర్‌ను సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై వాదనలు వినిపించారు. సునీల్ యాదవ్ తల్లి‌ని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడని వాదనల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో కక్ష కట్టి సునీల్ యాదవ్, వివేకా తలపై దాడి చేసి హత్య చేశాడని పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు.

అలాగే ఈ కేసులో ఎస్పీ రాంసింగ్ వ్యవహారం‌పై సుప్రీంకోర్టుకు వెళ్లారని, రాంసింగ్ వ్యక్తి గతంగా టార్గెట్ చేసి తమను ఇరికిస్తున్నారని, నిందితుడు భార్య తులసమ్మ వాదనలు వినిపించింది. దీంతో రామ్ సింగ్ వ్యవహారం పై అనుమానాలు రావడం తో, కొత్త ఐవో‌ను నియమించిందన్నారు. కొత్తగా నియమించిన సిట్ వివరాల ఆర్డర్ కాపీ ఉందా అని వాదనలు విన్న న్యాయస్థానం ప్రశ్నించింది.

నూతనంగా నియమించిన సీబీఐ సిట్ టీమ్ అధికారుల వివరాలను, పిటిషనర్ తరుపు న్యాయవాది ఇచ్చారు. గూగుల్ టెక్ ఔట్‌‌ను ఆధారంగా చేసుకొని ఎలా తమను కేసులో పెడతారని ప్రశ్నించారు. సీబీఐ, సునీత కలిసిపోయి దస్తగిరి‌ని అప్రూవర్‌గా మార్చారని వాదనల్లో ఆరోపించారు. తదుపరి విచారణ గురువారానికి కోర్టు వాయిదా వేసింది

LEAVE A RESPONSE