Suryaa.co.in

Andhra Pradesh

ఆదరణ పనిముట్లు సత్వరమే పంపిణీ చేయాలి

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
  • రానున్న రోజుల్లో చేనేతలను ఆధునీకరిస్తాం
  • రైతులకు 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లింపు…నాణ్యమైన ధాన్యం సంచులు రైతులకు అందాలి
  • రేషన్ పంపిణీలో అక్రమాలు అరికడతాం
  • క్షేత్రస్థాయికి వెళ్లే అంగన్వాడీ సూపర్ వైజర్లకు టీఏలు
  • జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి : బీసీల్లో వారసత్వంగా వచ్చే వృత్తులను ప్రోత్సహించడానికి గతంలో ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించాం. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా పనిముట్లు లబ్ధిదారులకు అందించకుండా పక్కనబెట్టింది. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు చిత్తూరు, అల్లూరి సీతారామరాజు మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో పనిముట్లు పంపిణీ చేయలేదు. వాటిని వెంటనే లబ్ధిదారులకు అందించాలి.

2014-19 మధ్య పలు చోట్ల బీసీ భవనాలు నిర్మించతలపెట్టాం. వాటిని కూడా గత ప్రభుత్వం పూర్తి చేయలేదు…సాధ్యమైనంత త్వరగా ఆ బీసీ భవనాలు పూర్తి చేయాలి.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సామాజిక న్యాయం జరగాలి. మొన్నటి ఎన్నికల్లో మేము కూడా సోషల్ రీ ఇంజనీరింగ్ నిర్వహించాం. చట్ట సభల్లోకి రాని కులాలు ఇంకా ఉన్నాయి. మేము చేపట్టిన సోషల్ రీ ఇంజనీరింగ్ వల్ల రజిక సామాజిక వర్గానికి చెందిన వారిని మొదటి సారి అసెంబ్లీకి తీసుకొచ్చాం.

అన్ని విధాలా ఇంకా కొన్ని కులాలు వెనకబడి ఉన్నాయి…వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ఎస్టీల కోసం మేము చైతన్యం అనే కార్యక్రమం నిర్వహించాం. అరకు కాఫీని ప్రమోట్ చేసి దేశంతో పాటు ప్యారిస్ లో కూడా అమ్మకాలు చేశాం. అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు నాంది ఫౌండేషన్ ద్వారా కృషి చేశాం.

ఎస్సీ, బీసీల వద్ద భూములు తక్కువగా ఉన్నాయి. వారిని సాధికారత సాధించాలి.బీసీలకు వారసత్వంగా కొన్ని వృత్తులు ఉన్నాయి. వారిని మోడరైజేషన్ వైపు మళ్ళించవచ్చు. గౌడ, ఈడిగ సామాజికవ వర్గం వారు కల్లు విక్రయిస్తారు. అందుకే వారికి 15 నుండి 20 శాతం వరకు షాపులు కేటాయించగలిగితే ఆర్థికంగా బలపడతారు.

ప్రస్తుతం చేనేత వస్త్రాలకు మళ్లీ ప్రాధాన్యం వస్తోంది. ఆధునీకరణ జోడిస్తే ఆర్థికంగా ఆయా వర్గాలను ఏ విధంగా పైకి తీసుకురావచ్చో కలెక్టర్లు, సంబంధిత అధికారులు బాధ్యత తీసుకోవాలి. ముస్లింలలో కూడా పేదరికం ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది ఆటో మొబైల్ రంగంలో ఉన్నారు. వారికి చేయూతనిస్తే ఆర్థికంగా బలోపేతం అవుతారు.

ఫ్యామిలీ, విలేజ్ ఇన్ ఫ్ట్రా స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యత పెంచాలి. ప్రస్తుతం ఆ వర్గాల తలసరి ఆదాయం ఎంత ఉంది…పెంచడానికి ఏం చేయాలో కూడా ఆలోచించాలి. గిరిజనుల్లో సంతోనోత్పత్తి రేటు రాష్ట్రంలో 1.7 ఉంది. మరణాల రేటులో జాతీయ స్థాయిలో7.47 ఉంటే…ఏపీలో 6.7 శాతం ఉంది.

మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి బరువు చిన్నారులు తక్కువ బరువుతో 29.6 శాతం మేర ఉన్నారు.పాపులేషన్ మేనేజ్మెంట్ క్యాంపెయిన్ మోడ్ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. అందరిలో అవగాహన తీసుకురావాలి. గతంలో సామూహిక సీమంతాలు నిర్వహించి దానికి తగ్గ ప్రాధాన్యత గురించి చర్చించేలా చేశాం.

సివిల్ సప్లై విధానం ద్వారా గతంలో ధాన్యం కొనుగోలు బాగుండేది. రైతులకు 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించాలి. గత ప్రభుత్వం లాగా గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని మళ్లీ తీసుకురాకూడదు. ఇచ్చిన గోతాలు కూడా చిల్లులు పడి ఉండి ధాన్యం పోకుండా నాణ్యమైనవి అందించాలి. సేకరించిన ధాన్యాన్ని ఇష్టమొచ్చిన రైస్ మిల్లింగ్ కు తీసుకెళ్లడానికి వీలు లేదు. ఎక్కడ పండించిన ధాన్యం అక్కడే దగ్గర్లోని రైస్ మిల్ కు తీసుకెళ్లే వెసులుబాటు రైతుకు కల్పించాలి.

మిల్లెట్స్ కు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుంది. మిల్లెట్స్ ను ప్రమోట్ చేయాలి. రేషన్ షాపుల్లో ప్రజల నచ్చినవిధంగా మాత్రమే రాగులు, సజ్జలు, ఇతర మిల్లెట్స్ విక్రయించాలి.

ఒకప్పుడు రైతు బజార్ల పర్యవేక్షణ జాయింట్ కలెక్టర్ల ఆధీనంలో ఉండేవి. ద్రవ్యోల్బణంను తగ్గిస్తే నిత్యవసర సరుకుల ధరలు తగ్గుతాయి. ఇంకో జాయింట్ కలెక్టర్ ను రెవెన్యూ పర్యవేక్షణకు నియమించాలి.

ఇంటింటికీ రేషన్ పంపిణీ అంటూ వాహనాలు తీసుకొచ్చారు. వాటి కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారు. రేషన్ పంపిణీ చేయడానికి 15 రోజుల పాటు ఇద్దరిని నియమంచి వారికి కూడా జీతం ఇచ్చారు. పంపిణీ పూర్తయ్యాక ఆ వాహనాలు మళ్లీ వేరే పనులకు ఉపయోగించుకున్నారు.

రేషన్ దుకాణాలకు రాలేని వారికి ఇంటింటి వెళ్లి ఇవ్వాలి. ఈ రేషన్ వాహనాలు ప్రవేశపెట్టిన తర్వాత రైస్ తీసుకోవడానికి వాహనం వచ్చే దాకా రోడ్లపై నిలబడాలి.

గతంలో వారికి అనుకూల సమయంలో వెళ్లి తెచ్చుకునేవారు. కాకినాడలో ఒకే ఫ్యామిలీలో సివిల్ సప్లై శాఖలో మూడు పదవుల్లో ఉన్నారు. ఎమ్మెల్యే, రైస్ మిల్లర్ల అసోషియేషన్, సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్లు చేశారు. ఇలాంటి వాటిని ఇక నియంత్రించాలి. అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్స్ ఏర్పాటు చేయాలి. క్షేత్రస్థాయికి వెళ్లే అంగన్వాడీ సూపర్ వైజర్లకు టీఏలు అందిస్తాం.

LEAVE A RESPONSE