– రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్
హైదరాబాద్: ప్రజావ్యతిరేక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాసమస్యలపై అవిశ్రాంతంగా పోరాడుతున్న బీఆర్ఎస్ ఉపనేత హరీశ్ రావు పై అక్రమ కేసులతో వేధించాలనుకున్న రేవంత్ రెడ్డి చిల్లర చేష్టలకు సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు.
ఫోన్ ట్యాపింగ్ కేసు పై హరిశ్ రావును ఇకమీదట ఎప్పడు విచారించొద్దు అని సుప్రీంకోర్టు చెప్పడం శుభపరిణామం. కెసిఆర్ మార్గదర్శనంలో కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత హామీలు, కృష్ణా, గోదావరి నదీ జలాల దోపిడీ కి వ్యతిరేకంగా హరీశ్ రావు గారు నిరంతరం పోరాటం చేస్తున్నారు.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న కేటీఆర్, హరీశ్ రావు తదితర ప్రతిపక్ష నేతల పై కక్షసాధింపు సాధింపు చర్యలు మానుకుని, ఇప్పటికైనా ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి సారించాలి. ప్రజల దృష్టిని మళ్లించడం ద్వారా పబ్బం గడపాలనుకుంటే ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకోక తప్పదు.