Suryaa.co.in

Andhra Pradesh

పోలింగ్ అధికారి సహా ఇతర సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

– పాల్వాయి పోలింగ్ కేంద్రం ఈవీఎంల ధ్వంసం పై కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ హరీష్‌గుప్తా నివేదిక

మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని త్వరలో అరెస్ట్ చేస్తామని డీజీపీ హరీష్‌గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఎయిర్‌పోర్ట్‌లను అప్రమత్తం చేశారు. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం చేశారని పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మాచర్ల ఘటనపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు నోటీసులు పంపింది. ఈవీఎం ధ్వంసం ఘటనపై వివరణ కోరింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రశ్నలు సంధించింది.

ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదు? కేసు పెడితే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చారా? నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా? లేదా? ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్‍ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం, ఆ తర్వాత వీడియోలు బయటకు రావడంతో అసలు ఏం జరిగిందనే దానిపై సీఈఓ మీనా వివరణ ఇచ్చారు. మాచర్లలో 7 ఘటనలు జరిగాయన్న ముఖేష్‌ కుమార్‌ మీనా.. ఈవీఎం ధ్వంసంపై సిట్‌ పోలీసుల నుంచి వివరాలు తీసుకున్నామన్నారు. అన్ని వీడియోలు పరిశీలించాక ఈ నెల 20న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎ1 నిందితుడిగా చేర్చుతూ కేసు నమోదు చేశామన్నారు.

పోలింగ్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన పోలింగ్ అధికారి సహా ఇతర సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. మాచర్ల పోలింగ్ స్టెషన్ లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి రావడంతో సిబ్బందిపై సస్పెన్షన్ వేటుకు గురి చేసింది.

LEAVE A RESPONSE