Suryaa.co.in

Andhra Pradesh

క్షత్రియ వర్గాన్ని వేధిస్తూ…రాక్షసానందం పొందుతున్నారు

– ప్రజలకు మేలుచేస్తూ, నిత్యంవారి యోగక్షేమాల గురించి ఆలోచించే అశోక్ గజపతిరాజుపై తప్పుడుకేసులు పెడతారా?
– చేసిన తప్పు ఒప్పుకొని, మంత్రులు వెల్లంపల్లి, బొత్స అశోక్ గజపతిరాజుకి బహిరంగక్షమాపణచెప్పాలి
• బిల్ గేట్స్, బిల్ క్లింటన్ పక్కన కూర్చున్న గొప్పపారిశ్రామికవేత్త సత్యం రామలింగరాజుని రాజశేఖర్ రెడ్డి జైలుపాలు చేశాడు
• గంగవరం పోర్ట్ నిర్వాహకులు డీ.వీ.ఎస్.రాజునువేధించారు
• మంత్రులు వెల్లంపల్లి, బొత్సలు నిన్న కావాలనే అశోక్ గజపతిరాజును అవమానించారు.
• విజయనగరంజిల్లాలోని ఆలయాలు, విద్యాసంస్థలకు దానమిచ్చిన అశోక్ గజపతిరాజు ఎక్కడ…. హుండీలో రూపాయి వేయని మంత్రి వెల్లంపల్లి ఎక్కడ?
– మాజీ ఎమ్మెల్యే ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ

క్షత్రియవర్గంపై వైసీపీప్రభుత్వం దాడిచేస్తున్నట్టుగా తమకు అనిపిస్తోందని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శమని, దేవుడిహుండీలో రూపాయికూడా వేయ ని మంత్రులు వెల్లంపల్లి, బొత్స సత్యనారాయణలు, వేలాదికోట్లవిలువైనభూములను దేవాల యాలకు, విద్యాసంస్థలకు దానమిచ్చిన పూసపాటి వంశీయులపై అనుచితవ్యాఖ్యలు చేయ డం అందులోభాగమేనని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ స్పష్టంచేశారు. గురువారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

విజయనగరం జిల్లాకు, ఆజిల్లాప్రజలకు పూసపాటి వంశీయులు ఎంతచేశారో, ఎన్నెన్ని దాన ధర్మాలుచేశారో అక్కడివారికి బాగాతెలుసు. అశోక్ గజపతిరాజుగారి కాలిగోటికి కూడా సరిపోని వ్యక్తులైన మంత్రులమన్న అహంకారంతో నిన్ననోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రభు త్వ అండదండలతోనే క్షత్రియవర్గంపై కావాలనే ఒకరకమైన దుష్ప్రచారం జరుగుతోంది. గతం లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి గొప్పవ్యక్తుల పక్కనకూర్చున్న గొప్పపారిశ్రామికవేత్త సత్యం రామలింగరాజుపై కక్ష సాధింపులకు పాల్పడ్డాడు.

ప్రపంచంలోనే టాప్ టెన్ కంపెనీల్లో ఒకటిగా పేరుపొందిన సత్యంకంప్యూటర్స్ ను మూత పడేసేంతవరకు రాజశేఖర్ రెడ్డి నిద్రపోలేదు. అలానే గంగవరం పోర్ట్ నిర్వాహకులైన డీ.వీ.ఎస్.రాజుని వేధించడం. వైసీపీ

ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అశోక్ గజపతిరాజుగారే లక్ష్యంగా పావులుకదుపుతోంది. అశోక్ గారు, ఆయనకుటుంబం చాలా సాదాసీదాగా జీవిస్తుంది. ఇప్పటికీకూడా అశోక్ గజపతిరాజుగారు ఆయన కారుని ఆయనే శుభ్రంచేసుకుంటారు. రామతీర్థం ఆలయం సహా, అనేక ఆలయాలకు పూసపాటి వంశీయులే అనువంశిక ధర్మకర్తలుగా ఉన్నారు. ఆ వంశీయులు వేలాదిఎకరాలను దేవాలయాలకు, విద్యాసంస్థలకు ఉదారంగా దానమిచ్చారు.

ఎక్కడ సెంటు భూమి కనిపిస్తే, దాన్నిఎలా దోచుకో వాలా అని ఆలోచించే ఇప్పుడున్నపాలకులకు, దానగుణం ఉన్న అశోక్ గజపతిరాజుగారి లాంటివారు దొంగలా, దోషిలా కనిపించడం సిగ్గుచేటు. అశోక్ గజపతిరాజుగారిని గతంలో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవినుంచి, ఆలయధర్మకర్త పదవినుంచి ప్రభుత్వం కక్షసాధింపుతో తొలగిస్తే, పాలకులచర్యలను న్యాయస్థానాలు తప్పుపట్టాయి. దాంతో ఆయనకే ధర్మకర్త బాధ్యతలు అప్పగించాలని కోర్టుచెప్పడంతో, ఈప్రభుత్వానికి విధిలేకుండా పోయింది. ఆయన ధర్మకర్త అయినాకూడా ఆలయ ఈవోగానీ, ఇతరఅధికారులు గానీ, ఏనాడూవెళ్లి ఆయన్నికలిసి మాట్లాడిందిలేదు.

ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు నోరెత్తడంలేదు. రామతీ ర్థం ఆలయంలో ఈప్రభుత్వం కొత్తగా చేపట్టిన అభివృద్ధిపనులేమీ లేవు. గతప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆలయధర్మకర్తగా ఆశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో జరిగినవే. ఈప్రభుత్వం వచ్చాకనే ఆలయపవిత్రత మంటగలిసింది. అక్కడరాములవారి విగ్రహాన్ని ధ్వంసంచేశారు. ఆ విగ్రహానికి అశోక్ గజపతిరాజుగారు విరాళమిస్తే, ఆలయఅధికారులు తీసుకోలేదు. అహాం కారంతో విర్రవీగుతున్న మంత్రులు, నిన్న అశోక్ గజపతిరాజుగారి విషయంలో హద్దులుమీరి ప్రవర్తించారు. తక్షణమే వారు చేసినతప్పు ఒప్పుకొని అశోక్ గజపతిరాజుగారికి బహిరంగ క్షమాపణలుచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

అశోక్ గజపతిరాజు గారి లాంటి గొప్పవ్యక్తి ఆలయ ధర్మకర్త హోదాలో ప్రశ్నిస్తే, ఆయనపై తప్పుడు కేసులు పెడతారా? ఈప్రభుత్వం కావాలనే రాష్ట్రంలోని క్షత్రియవర్గంపై దాడులు, వేధింపులకు పాల్పడుతోంది. నిత్యంప్రజల గురించి ఆలోచిస్తూ, ప్రజలకోసం యావదాస్తిని దానంచేసిన పూసపాటి వంశీయులతో పెట్టు కున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తగినవిధంగా బుద్ధిచెప్పడంఖాయం. రాబోయే రోజుల్లో పాలకు లుగానీ, ప్రభుత్వంలోనివారుగానీ క్షత్రియవర్గంపై కన్నెత్తిచూస్తే అందుకు తగినమూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE