డ్రగ్స్ కుంభకోణం వెనుక తాడేపల్లి ప్యాలెస్ హస్తం

యువత భవిత చిదిమేస్తున్న జగన్ డ్రగ్ మాఫియా
దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే

– ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్

కూనం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకుడు. కూనం కుటుంబం మొత్తం వైసీపీ వ్యవస్థాపక సభ్యులే. బ్రెజిల్ దేశాధ్యక్షునికి విజయసాయిరెడ్డి ఎందుకు ట్వీట్ చేశారు. సీబీఐ అధికారుల విధులకు ఏపీ ఉన్నతాధికారులు ఎందుకు ఆటంకాలు కల్పించారు?

టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో నెం.1 స్థానంలో ఉన్న ఏపీని జగన్ రెడ్డి.. గంజాయి, డ్రగ్ లో నెం.1 స్థానానికి చేర్చాడు. విశాఖను స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి.. డ్రగ్ క్యాపిటల్గా మార్చారు. వీరభద్రరావు సోదరుడు కూనం పూర్ణచంద్రరావు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వైసీపీ సీనియర్ నేత, ఇతనికి విజయసాయిరెడ్డితో సన్నిహిత సంబందాలున్నాయి.

విశాఖ పోర్టు కంటెయినర్ లో మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫటేమిన్, మెస్కిలన్ వంటి భయంకర మత్తు పధార్ధాలున్నాయని సీబీఐ తన నివేదికలో పేర్కొంది.గతంలో విజయవాడలోని ఆశి ట్రేడర్స్ పేరుతో, ముంద్రా పోర్టులో రూ. 21 వేల కోట్ల విలువైన హెరాయిన్
దిగుమతిలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.

ఇప్పుడు ఏకంగా డ్రై ఈస్ట్ తో కలిపి రూ.50 వేల కోట్ల విలువైన 25 వేల కిలోల మార్పిన్, కొకైన్,హెరాయిన్, యాంఫటేమిన్, మెస్కిలన్ వంటి భయంకర డ్రగ్స్ ఉన్నాయని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే దొరుకుతున్నాయి.

బ్రెజిల్ నుంచి మత్తు పదార్దాలు దిగుమతి చేస్తున్నారని తెలిసే జగన్ రెడ్డి తన అధికారులను పంపారా? కల్తీ మద్యం మాఫియాతో ఇన్నాళ్లూ ప్రజల ఇళ్లూ, ఒళ్లూ, ప్రాణాలు నాశనం చేశారు. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని డ్రగ్స్ కేపిటల్ గా మారుస్తున్నారు.

జగన్ రెడ్డి దోపిడీని యువత ప్రశ్నించకుండా, నిలదీయకుండా ఉండడం కోసం మత్తులో దించి, గేమింగ్, క్యాసినోతో జాతిని నిర్వీర్యం చేస్తున్నాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాడు. సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగా తెలుగుదేశం పార్టీకి ఆపాదించే కుట్ర చేస్తున్నారు.

కూనం వీరభద్రరావు కరోనా సమయంలో సీఎం రిలీఫ్ ఫండికి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డితో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. డ్రగ్స్ దిగుమతి అయిన బ్రెజిల్ అధ్యక్షుడి ఎన్నిక రోజున విజయసాయి రెడ్డి ట్వీట్ చేయడం ఆశ్చర్యకరం.

కూనం వీరభద్రరావు స్వగ్రామం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు వీధిమూడిలో వైసీపీ ప్లెక్సీలు వేశారు. డ్రగ్స్ సీజ్ చేయడానికి వెళ్లిన సమయంలో స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించారని సీబీఐ అధికారులు తమ ఎఫ్ఎఆర్ పేర్కొన్నారు.
“During the process of examination, Various officers of AP
Govt and port employees gathered at site causing delay in the
CBI Proceedings. The representatives of importer informed
that there is prediction of rainfall and all his goods might get
damaged in rainfall, hence the requested to keep the goods
inside the container for the day for its safe custody.” అని పేర్కొనడం
వాస్తవం కాదా?

తాడేపల్లి ప్రమేయం లేకుండా సీబీఐ అధికారుల్ని స్థానిక పోలీసులు అడ్డుకోగలరా? 16వ తేదీన కంటైనర్ వస్తే, 20వ తేదీ వరకు సీబీఐ అధికారుల్ని నిలువరించారు. డ్రగ్స్ కుంభకోణం వెనుక తాడేపల్లి ప్యాలెస్ హస్తం ఉంది. అందుకే వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

జగన్ రెడ్డికి సంబంధం లేకుండా ,ఎవరైనా ఇంత స్థాయిలో డ్రగ్స్ వ్యాపారం చేసే అవకాశం ఉందా? గతంలో నిమ్మగడ్డ ప్రసాద్, కోనేరు ప్రసాద్ లాంటి వారితో వైసీపీ చేయించిన అక్రమాలు తెలియనిదెవరికి ? 2019 ఎన్నికల సమయంలో వివేకా హత్యనూ టీడీపీ పైకి నెట్టారు. కోడికత్తినీ నెట్టారు. జగన్ రెడ్డి

అధికారంలోకి వచ్చాక జరిగిన ఆశీ ట్రేడర్స్ డ్రగ్స్ కేసునూ టీడీపీకి లింక్ చేశారు. విశాఖకు మకాం మారుస్తున్నానని జగన్ రెడ్డి చెప్పడం డ్రగ్స్, భూకబ్జాల కోసమేనా? విశాఖ కేంద్రంగా డ్రగ్స్ మాఫియాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. యువతను డ్రగ్స్ మత్తులో ముంచి రాష్ట్రాన్న లూటీ చేసేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు.

కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్ని తనవారికి కట్టబెట్టి తద్వారా తమ అక్రమ వ్యాపారాల్ని చేసుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఆఫ్రికా దేశాల్లో ద్వారంపూడి పర్యటించగా.. అవే దేశాలకు జగన్ రెడ్డి బియ్యం మాఫియా తర్వాత అవే దేశాలకు రాష్ట్రంలోని రూ.7 వేల కోట్ల విలువైన బియ్యం ఎగుమతి చేసి దోచుకున్నారు.

ప్రాంతీయ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏంటో నేడు బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్ కంటెయినర్ తో బట్టబయలైంది.

 

Leave a Reply