ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి పై చర్యలు తీసుకోండి

• తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కింజారపు అచ్చెన్నాయుడు
• పోలింగ్ బూత్ లపై ప్రధాన ఎన్నికల అధికారికి రెండు లేఖలు రాసిన అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో 3,005 సున్నితమైన పోలింగ్ బూత్ లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి.పోలింగ్ బూత్ ల బయట, లోపల వీడియోగ్రఫీని ఏర్పాటు చేయడంతో పాటు మైక్రో అబ్సర్వర్‌లను నియమించాలి.
శాంతిభద్రతలకు బాధ్యత వహించే పోలీసు అధికారుల ఫోన్ నంబర్‌లను తెలియజేయాలి.

ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. వెంకట రమణా రెడ్డిపై సీఈసీకి ఫిర్యాదు చేస్తూ ఎన్నికల అధికారికి మరో లేఖ రాసిన అచ్చెన్నాయుడు. సచివాలయం ఉద్యోగులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి సీసీఏ నిబంధనలు అధిగమించారు.వైసీపీకి మద్దతుగా సమావేశాలు నిర్వహిస్తూ ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారని లేఖలు రాశారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న మీడియాపై దుర్భాషలాడి, వైసీపీకి అనుకూలంగా అతను చేసిన విడియో క్లిప్పింగ్‌లను లేఖకు జత చేసి ఎన్నికల అధికారికి అందించారు.

Leave a Reply