– సోషల్ మీడియాలో జనసేనపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన జనసేన నేతలు
– జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు
నలుగురు వ్యక్తులు అధికంగా సోషల్ మీడియాలోజనసేనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.వారిపై జిల్లా ఎస్పికి ఫిర్యాదు చేశాం.పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని నిజాయితీ నిరూపించుకోవాలి.వారాహి యాత్ర విజయవంతం అయిందన్న అక్కసుతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ లో ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు ఈ విషయంపై వారి పరిధిలో ఉన్న స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరుగుతున్నది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాయుబ్ కమాల్, జిల్లా నాయకులు అడపా. మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లికా, నారాదాసు రామచంద్ర ప్రసాద్ ,కొప్పుల కిరణ్, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్,శిఖా బాలు, పాకనాటి రమాదేవి, నెల్లూరు రాజేష్, శ్రీపతి భూషయ్య ,కూరపాటి నాగేశ్వరరావు, తన్నీరు గంగరాజు, తోట కార్తీక్, బండారు రవి ,పులిగడ్డ గోపి తదితరులు పాల్గొన్నారు.