Suryaa.co.in

Telangana

ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాలి మాటలు

-క్రమబద్ధీకరణ పథకంపై కోర్టు స్టే ఉన్నదని కిషన్ రెడ్డికి తెలియదా?
-గుజరాత్ లో కూడా వంతెన కూలి 180 మంది మరణించారు
-మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు రాజకీయ రంగు పులమటం కిషన్‌రెడ్డి స్థాయి తక్కువ రాజకీయాలకు నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ విమర్శించారు. తన నియోజకవర్గంలో జరిగిన ఘటనపై తనకంటే ఎక్కువ ఆందోళన మిగిలిన వారికి ఎందుకుంటుందని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి గాలిమాటలు మానుకోవాలని సూచించారు.ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

తలసాని ఏమన్నారంటే.. నిన్న రాంగోపాల్ పేట సమీపం లోని నల్లగుట్ట ప్రాంతం లో అగ్నిప్రమాద ఘటన జరిగింది.ప్రమాదం జరిగిన భవనం లో కెమికల్స్ ఉండటం వల్ల మంటలు తొందరగా అదుపులోకి రాలేదు.ప్రభుత్వ విభాగాలన్నీ వెంటనే స్పందించాయి.పక్కన ఉన్న బస్తీ వాసులకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నాం.భాదితులను కాపాడే క్రమం లో అగ్ని మాపక సిబ్బంది గాయాల పాలయ్యారు. నిన్న అగ్ని ప్రమాదానికి గురైన కట్టడం లాంటివి 25 వేల వరకు హైద్రాబాద్ నగరంలో ఉండవచ్చు. అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదు.ఇలాంటి కట్టడాల విషయం లో ఏం చేయాలి అన్నదానిపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నాం.ఈ నెల 25 న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం. ప్రమాదం జరిగిన కట్టడం నాణ్యత పై nit ఆధ్వర్యంలోని కమిటీ తన నివేదిక ని త్వరలోనే సమర్పిస్తుంది.. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నాం.

ప్రమాద ఘటన పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారు.డబ్బుల కోసం అక్రమ కట్టడాలు క్రమబద్దీ కరిస్తున్నామని కిషన్ రెడ్డి బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారు.మా ప్రభుత్వ హాయం లో ఒక్క భవనాన్ని కూడా రేగులరైజ్ చేయలేదు. భవనాల క్రమబద్ధీకరణ పథకం పై కోర్టు స్టే ఉన్నదని కిషన్ రెడ్డి కి తెలియదా?హైద్రాబాద్ కు కిషన్ రెడ్డి ఒక్క పైసా తెచ్చింది లేదు.. గాలి మాటలు మాట్లాడుతున్నారు.గత ఎనిమిదేళ్లలో హైద్రాబాద్ నగరం సాధించిన అభివృద్ధిలో కేంద్రం పాత్ర శూన్యం. గుజరాత్ లో కూడా వంతెన కూలి 180 మంది మరణించారు.. కిషన్ రెడ్డి లాగా మేము రాజకీయాలు చేశామా?హైదరాబాద్ అభివృద్ధి కి గత ఎనిమిదేళ్లలో 65 వేల కోట్ల రూపాయలు కేటాయించాము.ఇంత అభివృద్ధి గతం లో ఎపుడైనా జరిగిందా? ప్రమాదం జరిగిన చోట హెల్త్ క్యాంప్ లు పెట్టాలని కిషన్ రెడ్డి ఉచిత సలహా ఇస్తున్నారు.అక్కడ ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు కిషన్ రెడ్డి చెప్పక ముందే చేశాము.రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదు.భాదితులను ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వమా ..కేంద్ర ప్రభుత్వ అధికారులా?

కిషన్ రెడ్డి భాద్యత లేకుండా మాట్లాడటం ఇప్పటికైనా మానాలి.టూరిజం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైద్రాబాద్ కు పొలిటికల్ టూరిస్టు గా వచ్చి పోతూ గాలి మాటలు మాట్లాడుతున్నారు.2008 నుంచి అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకం లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని కిషన్ రెడ్డి ఎలా అంటారు.గతం లో జరిగిన అన్ని ప్రమాదాల్లో భాదితులకు నష్ట పరిహారం ఇచ్చింది.బీహార్ కు చెందిన వ్యక్తులు ఇక్కడ ప్రమాదం లో చనిపోతే సీఎం కేసీఆర్ స్వయంగా ఆ రాష్ట్రానికి వెళ్లి exgratia చెక్కు లు ఇచ్చారు..అక్రమ కట్టడాల విషయం లో ఏం చేయాలన్న దానిపై అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహిస్తాం. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతానికి నేను ప్రజాప్రతినిధిని.. నాకు ఉన్న పట్టింపు మిగతా వారికి ఎందుకు ఉంటుంది?

LEAVE A RESPONSE