Suryaa.co.in

Andhra Pradesh

దళిత ద్రోహి అరుణ్ కుమార్.. మీ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపండి

-రెండు నెలల తర్వాత మీ జగన్ రెడ్డి అసెంబ్లీలో ఉంటాడో లేక ‘చంచల్ గూడ జైల్లో’ ఉంటాడో..
-అరుణ్ కుమార్ చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతారు
-మాట్లాడేటప్పుడు భాషలో కాస్తంత సంస్కారం ఉండేలా చూసుకోండి
-మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య శుక్రవారం నాడు ఉదయం ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యువ నాయకులు నారా లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తన కార్యాలయంలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక మన రాష్ట్రంలో దళితులకు జరిగిన అనేక అన్యాయాల గురించి నారా చంద్రబాబునాయుడు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముంటే జగన్ రెడ్డి జవాబు చెప్పి ఉండేవాళ్లు… ఆ ప్రశ్నలకు ఆయనదగ్గర జవాబులు లేనందు వల్లే… దళితుల చేత్తో దళితుల కన్ను పొడిపించేందుకుగాను మిమ్మల్ని ఊసికొల్పి మాట్లాడించారన్న వాస్తవాన్ని ముందుగా మీరు అర్థం చేసుకోవాలి మిస్టర్ అరుణ్ కుమార్.

ప్రభుత్వ ప్రతినిధిగా మీరు మాట్లాడి ఉండి ఉంటే ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి. కానీ రెండు నెలల తర్వాత జరిగే అసెంబ్లీకి రండి అక్కడ చర్చించుకుందాం అంటూ ‘ఉత్తర కుమారుడిలా’ చాలెంజ్ లు చేయడం హాస్యాస్పదంగా ఉంది. అసలు రెండు నెలల తర్వాత మీ జగన్ రెడ్డి అసెంబ్లీలో ఉంటాడో లేక ‘చంచల్ గూడ జైల్లో’ ఉంటాడో తెలుసుకొని మీరు మాట్లాడి ఉంటే బాగుండేది. మీ స్థాయి మరిచి గౌరవ ప్రతిపక్ష అధినాయకుడిపై చాలెంజ్ లు విసరడం ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం లాంటిదే.

గతంలో కూడా పరిటాల సంక్రాంతి సంబరాలు అప్పుడు మా అధినేత నారా చంద్రబాబునాయుడు ని తిరగనివ్వం అంటూ ఛాలెంజ్ లు విసిరారు. చివరకు ఏమైంది మీ ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గారి నందిగామ రోడ్ షో లో జన ప్రభంజన సునామీని చూసి మీరు నోరు తెరవడం తప్ప చేసింది ఏమీ లేదు? దట్ ఇస్ చంద్రబాబు నాయుడు. వేల కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో 16 నెలలు జైల్లో చిప్పకూడు తిని బెయిల్ మీద బయట తిరుగుతూ… నేడో రేపో బాబాయ్ హత్య కేసులో కూడా నిందితుడిగా సిబిఐ కోర్టులో నిలబడబోతున్న జగన్ రెడ్డి కి నిస్సిగ్గుగా ఊడిగం చేస్తున్న మీరు… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష సంస్కారహీనంగా, అనాగరికంగా ఉంది… పదవిని కాపాడుకోవడానికి ఇంత దారుణంగా దిగజారి మాట్లాడవలసి రావడం సిగ్గుచేటు. దొడ్డిదారిన వచ్చిన ఎమ్మెల్సీ పదవిని కాపాడుకోవడం కోసం దళితులకు ఎంతో ప్రయోజనం కలిగించే 27 గత తెలుగుదేశం ప్రభుత్వం పథకాలను ఆపేసి, ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తన సొంత ఓటు బ్యాంకు పథకాలకు వాడుకుంటున్న జగన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న అరుణ్ కుమార్ చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతారు అన్నది వాస్తవం.

చాలెంజ్ విసిరే స్థాయి మీది అయితే ముందుగా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి… గత నాలుగు సంవత్సరాల నుండి ఎస్సి,ఎస్టి సబ్ ప్లాన్ నిధులన్నీ సొంత పథకాలకు వాడుకుంటూ ఆ వర్గాలు ఆర్థికంగా ఎదగడానికి ప్రత్యేకంగా ఉన్న అవకాశాలను రద్దు చేయడం వాస్తవం కాదా…? ఎస్సీ కార్పొరేషన్ ను తన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయకుండా ఈ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కొద్ది రోజుల క్రితమే హైకోర్టు మందలించిన విషయం వాస్తవం కాదా…? గత నాలుగేళ్లుగా ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను కనీసం ఒక్కసారి కూడా భర్తీ చేయకుండా తొక్కిపెట్టి ఉంచటం వల్ల దళిత యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన మాట వాస్తవం కాదా..? అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని మూడేళ్లపాటు అమలు చేయకుండా పక్కనపెట్టి ఆ తర్వాత దారుణంగా ఆ పథకం పేరు మార్చి ఎవరు ఉపయోగించుకోలేని విధంగా నిబంధనలు పెట్టి ఎంతోమంది దళిత విద్యార్థుల విదేశాలకు వెళ్లే అవకాశాలను అడ్డుకున్న విషయం నిజం కాదా..? దళిత విద్యార్థులు సివిల్ సర్వీస్ మరియు ఇతర బ్యాంక్ ఎగ్జామ్స్ లాంటి ఎన్నో పోటీ పరీక్షల కోసం నచ్చిన ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకొని అవకాశం లేకుండా చేసి నామమాత్రమైన స్టడీ సర్కిల్స్ తో వారి భవిష్యత్తును దెబ్బతీసిన విషయం వాస్తవం కాదా..?

దళిత విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్న “బెస్ట్ అవైలబుల్ స్కూల్స్” పథకాన్ని అస్తవ్యస్తం చేసిన విషయం నిజం కాదా..? ఆ స్కూళ్లకు కనీసం బిల్లులు కూడ చెల్లించకుండా బకాయిలు పెట్టిన విషయం వాస్తవం కాదా..? ఈ సమస్య గురించి ఆ విద్యార్థులంతా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి రావడం నిజం కాదా..? తెలుగుదేశం ప్రభుత్వంలో దళిత యువత కోసం కోట్లాది రూపాయలు కేటాయించి… ఇన్నోవా కార్లు, ప్యాసింజర్ వెహికల్స్ ట్రాన్స్ పోర్ట్ ట్రక్కులు, ఆటోలు అందించి లక్షలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిన పథకాలు అన్ని వైసీపి ప్రభుత్వం వచ్చాక ఆపిన విషయం వాస్తవం కాదా…? గత నాలుగేళ్లలో మీరు దళితులకు ఇచ్చిన వాహనాలు ఎన్ని..? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన రుణాలు ఎన్ని..? మీరే చెప్పండి మీ బండారం బయటపడుతుంది. మీరు డిబిటి పద్దతిలో పంచిన రెండు లక్షల కోట్ల రూపాయల వల్ల ఈ రాష్ట్రం అప్పులు పది లక్షల కోట్లకు పెరిగాయ తప్ప… ఇక్కడ పేదరికం ఒక్క శాతం కూడ తగ్గకపోగా ఇంకా పెరిగిన విషయం వాస్తవం కాదా..?

ఇలా ఎన్నో, ఎన్నెన్నో రకాలుగా దళితుల అభివృద్ధిని, ప్రయోజనాలను ఈ వైసీపీ ప్రభుత్వం కాలరాసిన విషయం గురించి ప్రశ్నిస్తే సూటిగా జవాబు చెప్పకుండా … అందరికీ అందే పింఛన్లలో ఇంగ్లీష్ మీడియంలో, సీబీఎస్సీ సిలబస్ చదువుకునే పిల్లల్లో దళితులు ఉన్నారు కదా అంటూ… అన్ని ప్రశ్నలకు “ఆవు కథే” జవాబు అన్నట్టుగా “నవరత్నాలను” వల్లించడం హాస్యాస్పదం… మీరు ఈ విధంగా మాయమాటలతో ఎంతోకాలం దళితులను మోసగించాలనుకోవటం సాధ్యపడదని గ్రహించాలి… మీరు చరిత్రలో దళిత ద్రోహిగా మిగలకూడదని నిజంగా భావిస్తే తక్షణమే గత ప్రభుత్వం నడిపిన 27 పథకాలను తిరిగి ప్రారంభించండి అలాగే ఇప్పటివరకు సొంత పథకాలకు వాడుకున్న ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆ వర్గాలకు తక్షణమే కేటాయించండి. చదువుకున్న నేరానికి మాట్లాడేటప్పుడు భాషలో కాస్తంత సంస్కారం ఉండేలా చూసుకోండి.

LEAVE A RESPONSE