విద్యుత్ బిల్లులు చూసి ఇళ్లల్లో గుడ్డి దీపాలు పెట్టుకుంటున్న ప్రజానీకం

మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
నందిగామ: అసలే కరోనా ప్రభావంతో అన్ని వర్గాల ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఆస్తిపన్ను, చెత్తపన్ను, నిత్యవసరాల ధరలు పెరిగి బ్రతుకే భారంగా మారిన పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల భారం కూడా ప్రజలపై పడుతోంది. పెంచుతున్న ఛార్జీలు సెప్టెంబర్ నుంచే అమలులోకి వచ్చాయి.
ఇతర రాష్ట్రాలకన్నా మన రాష్ట్రంలో విద్యుత్ రేట్లు ఎక్కువగా ఉన్నందున ఈ రాష్ట్రంలోకి పరిశ్రమలు కూడా రావడం లేదు రోజురోజుకు నిరుద్యోగం మరింత పెరిగిపోతుంది. వైసీపీ నేతల లూటీకి, దుబారాకు విద్యుత్ వినియోగదారులు మోయలేని భారాలు మోయాలా..?
ట్రూ అప్ ఛార్జీలు పెంచి నెల కూడా తిరక్కముందే మరోసారి ట్రూఅప్ ఛార్జీల పేరుతో రూ.2542 కోట్లు పెంచనున్నారు.జగన్ రెడ్డి ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు, ఇప్పటికే 5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు 6వ సారి పెంచుతున్నారు.గతంలో వంద రూపాయల బిల్లు వస్తే ఇప్పుడు వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి.విద్యుత్ రంగానికి జగన్ రెడ్డి చేసింది సున్నా-లాభం చేయకపోగా నష్టం చేశాడు.
నందిగామ మండలం : అంబారుపేట గ్రామము నందు శుక్రవారం ఉదయం దేవిశరనవరాత్రుల సందర్భంగా శ్రీ సత్తెమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతేక్య పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరినించిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య , అనంతరం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఐలపొగు ప్రశాంత్ ను ఎన్నుకొని గ్రామ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని మాట్లాడటం జరిగినది. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు పాల్గొన్నారు.

Leave a Reply