ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన దేవాలయాలకు పాదయాత్ర చేపట్టి నిరసన తెలిపిన నాయకులు
తెలుగు మహిళ, అంగన్ వాడీ నేతృత్వంలో కొనసాగిన నిరసన కార్యక్రమాలు
టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసిన పోలీసులు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా 7వ రోజు టీడీపీ అనుబంధ విభాగాలైన తెలుగు మహిళ, అంగన్ వాడీ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు విడుదల కావాలని కోరుంటూ ఉమ్మడి జిల్లాల్లోని దేవాలయాల సందర్శన యాత్ర చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల జంక్షన్ నుంచి అరసవిల్లి సూర్యనారాయణ దేవస్థానం వరకు నేతలు పాదయాత్ర నిర్వహించారు. విజయనగరంలో కోట జంక్షన్ నుంచి పైడితల్లి అమ్మవారి దేవాలయం వరకు ఉమ్మడి జిల్లా నాయకులు పాదయాత్ర చేశారు. అదేవిధంగా విశాఖలో సింహాచలం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో తిమ్మాపురం నుంచి ద్వారకా తిరుమల దేవస్థానం వరకు టీడీపీ నేతలు పాదయాత్రగా వెళ్లారు.
గుంటూరులో శారద కాలనీ నుంచి నాజ్ సెంటర్ లోని ఆంజనేయస్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కార్యాలయం నుంచి ఇసుక దర్శిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో శాంతిపేట నాలుగుకాళ్ల మండపం నుంచి రంగనాయకులు దేవాలయం వలకు పాదయాత్ర చేపట్టారు.
చిత్తూరు జిల్లాలో కాలూర్ జంక్షన్ నుంచి తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతపురంలో కదిరి నియోజకవర్గం నానా దర్గా నుంచి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. కర్నూలులోని కాలువబుగ్గ వాటర్ ప్లాంట్ నుంచి కాలువబుగ్గ రామేశ్వరస్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. కడపలో కొత్త మాధవరం బ్రిడ్జి నుంచి ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.
టీడీపీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమాలతో పాటు దేవస్థానాల్లో నిర్వహించ తలపెట్టిన ప్రత్యేకపూజలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలువురు నాయకులను గృహనిర్బంధం చేశారు. మరికొందరిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోస్ట్ కార్డులు పంపించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అంటూ పలుచోట్ల హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు.
టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను సందర్శించారు. నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో బాబుతో నేను అంటూ సైన్ బోర్డులు ఏర్పాటుచేయడంతో సామాన్య ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయడంతో పాటు చంద్రబాబుకు మద్దతుగా సంతకాలు చేశారు. విజయనగరంలో కార్పోరేషన్ పరిధిలో 50 డివిజన్లు, విజయనగరం గ్రామీణ మండలంలో ఉన్న 22 పంచాయతీల్లో రిలే నిరహారదీక్షలను పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. విశాఖలో పలువురు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. చిన్న వాల్తేరులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడును గృహ నిర్బంధం చేశారు.
విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడును పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, కోరాడ రాజబాబును గృహనిర్బంధం చేశారు. విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి సారే సమర్పించేందుకు వినాయకుడి వద్దకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును అక్రమంగా అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీసుస్టేషన్ తరలించారు. ఆయన మారువేషంలో వెళ్లి వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి గుడి వద్దకు ఆటోలో మారువేషంలో టోపీ పెట్టుకుని వచ్చి పూజలు నిర్వహించారు. దుర్గ గుడికి వెళ్తున్న బుద్ధ వెంకన్నను అరెస్ట్ చేయడంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బుద్దా వెంకన్నను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు సారె సమర్పించేందుకు వినాయకుడి గుడి వద్ద నుంచి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవస్థానం వరకు వెళ్లిన టీడీపీ శ్రేణులను అడ్డుకుని గృహ నిర్బంధాలకు గురిచేశారు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయడానికి వెళుతున్న కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. దుర్గగుడికి వెళ్తున్న వైవీబీ రాజేంద్రప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్ అరెస్ట్ చేసి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, సెంట్రల్ పార్టీ కోశాధికారి శ్రీరాం తాతయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు, హౌస్ అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, పొన్నూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ధూళిపాళ్ల నరేంద్ర, గుంటూరు పశ్చిమ ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర, తెనాలి నియోజకవర్గ ఇంఛార్జ్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర కమిటీ నాయకులు సుఖవాసి కనపర్తి, పిల్లి మాణిక్యాలరావు తదితర ముఖ్య నాయకులను గృహనిర్బంధం చేశారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, చిలకలూరిపేట ఇంఛార్జ్ పత్తిపాటి పుల్లారావు నిరసనకు దిగగా గారిని హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరులో నక్కా ఆనంద్ బాబు, రేపల్లెలో అనగాని సత్య ప్రసాద్ ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబుకు మద్దతుగా రాజధానిలో మహిళా రైతులు రిలే నిరాహదర దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో 29 గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు. జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు.
శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల జంక్షన్ నుంచి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం వరకు జరిగే పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను హౌస్ అరెస్ట్ చేశారు. నెల్లూరులో టీడీపీ నేత బీదా రవిచంద్ర ఆధ్వర్యంలో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి, ఎన్.ఎం.డి ఫరూక్, నిమ్మకాయల చినరాజప్ప, పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, గన్ని వీరాంజనేయులు, కె.ఎస్ జవహార్, రెడ్డి అనంతకుమారి, కూనరవికుమార్, జ్యోతుల నవీన్, నూకసాని బాలజీ, అబ్ధుల్ అజీజ్, బిటి నాయుడు, మల్లెల లింగారెడ్డి, గొల్లా నరసింహాయాదవ్, పులివర్తి నాని, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయస్వామి, కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్ రావు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.