జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల కిషోర్ అధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గం హిమయత్ నగర్ డివిజన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ కార్యనిర్వహక అధ్యక్షులు (వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల కిషోర్) అధ్వర్యంలో డివిజన్ లోని రాంకోఠి చౌరస్తాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

కార్యక్రమానికి స్థానిక టీడీపీ నాయకులు హాజరయ్యారు. స్థానిక ప్రజలు, తెలుగుదేశం అభిమానులు పెద్ద ఎత్తున సభ్యత్వం చేసుకొన్నారు. సభ్యత్వ నమోదు వేగంగా జరగడానికి లాప్ టాప్ మరియు స్థానిక నాయకుల సెల్
k1 ఫోన్ లను వినియోగించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి భారీగా స్పందన వస్తున్నదని, ప్రజలే స్వచ్చంధంగా వచ్చి సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారని పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల కిషోర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సీ హెచ్ ప్రదీప్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి విజయ్ రాపర్తి, తెలంగాణ ఆటోమొబైల్ అసోసియేషన్ మాజీ
k2 అధ్యక్షులు శ్రీనివాస్ గుప్త, డివిజన్ ఉపాధ్యక్షులు యాదగిరి, నర్సింగ్ రావు, రాజు కుమార్, రవి, మనీష్, రఘు, రామకృష్ణ రావు, తదితరులు పాల్గొన్నారు.