Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఆత్మస్తుతి పరనింద

• టీడీపీప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు, కంపెనీలు తరిమేసిన జగన్ రెడ్డి, చివరకు చంద్రబాబు యువతకోసం ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు మూసేయించి, నిరుద్యోగ భృతి తీసేసి రాష్ట్ర యువత నోట్లో మట్టి కొట్టాడు : కంచర్ల శ్రీకాంత్
• జగన్ సర్కార్ ఉభయసభల్లో చేసిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగం ఆత్మస్తుతి పరనిందలా సాగింది. బడ్జెట్ పై వైసీపీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. : భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి
• అంకెల గారడీ.. అభూత కల్పనల మేళవింపు
• రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే, ప్రజలకు మేలుచేసే ఒక్క అంశం కూడా జగన్ రెడ్డి సర్కార్ ఇన్నేళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో కనిపించలేదు
• ముఖ్యమంత్రి సహా, వైసీపీ నేతల దోపిడీసామర్థ్యం పెరిగిందని ప్రభుత్వం తాజా బడ్జెట్లో సామర్థ్యఆంధ్రా అనే ప్రస్తావన చేసిందా? : చిరంజీవి రావు
• భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి రావు 

జగన్ రెడ్డి సర్కార్ నేడు అసెంబ్లీ, కౌన్సిల్లో బడ్డెట్ ప్రవేశపెట్టిందని, బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు సభలో చెప్పిన సూక్తుల్లో ఎన్నిపాటిస్తున్నాడో గుండెలపై చేయి వేసుకొని ముఖ్యమంత్రే ఆలోచించుకోవాలని, అన్నిరంగాల్లో రాష్ట్రం పురోగ మిస్తోందని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని, వ్యవసాయరంగం మేలుకోసం .. రైతాంగం సంతోషం కోసం ఏం చేయబోతున్నారో బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొనకపోవ డం నిజంగా బాధాకరమని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి చెప్పారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన బుధవారం సహచర ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవిరావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే …

బడ్జెట్ ప్రసంగంలో కరువు మండలాల ప్రస్తావన…నష్టపోయిన రైతుల్నిఆదుకునే అంశాలు లేకపోవడంపై జగన్ రెడ్డి రైతులకు సమాధానం చెప్పాలి
“ బడ్జెట్ ప్రసంగంలో కరువు మండలాల గురించి, కరువు వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది చెప్పలేదు. జగన్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే తన సొంత నియోజకవర్గమైన పులి వెందులలో రైతుల అభిప్రాయాలు సేకరించాలి. ఐవీఆర్ఎస్ ద్వారా గానీ, స్వచ్ఛం ద సంస్థ ద్వారా గానీ వైఎస్సార్ పంటలబీమా పథకం తీరుతెన్నులు, రైతు భరోసా కేంద్రాల పనితీరుపై ముఖ్యమంత్రి అభిప్రాయసేకరణ జరపాలి. మెజారిటీ రైతులు తమ విషయంలో జగన్ ప్రభుత్వ పనితీరు బాగుందని చెబితే బహిరంగం గా క్షమాపణలు చెప్పడానికి నేను సిద్ధం.

బడ్జెట్ ప్రసంగంలో అయినా ప్రభుత్వం కరువు బారిన పడి నష్టపోయిన తమను ఆదుకుంటుందని రైతులు ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం ఎక్కడా ఆ ఊసే ఎత్తలేదు. బడ్జెట్ ప్రసంగంలో మరో పచ్చి అబద్ధం చెప్పారు. మైక్రో ఇరిగేషన్ అమ ల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి రైతులకు డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి ఒక్క చిన్న పైపు ముక్క కూడా ఇచ్చింది లేదు. డ్రిప్, స్ప్రింక్లర్ విధానానికి సంబంధించి రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించింది లేదు. అలాంటప్పుడు మైక్రో ఇరిగేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ముందువరసలోఎలా నిలుస్తుందని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం.

చంద్రబాబునాయుడి హాయాంలో ఉద్యానవన పంటల సాగుకి రైతులకు అందించిన సబ్సిడీలు, వివిధ రకాల ప్రోత్సాహకాల వల్లే నేటికీ రాష్ట్రం మైక్రో ఇరిగేషన్ రంగంలో దేశంలో ముందుంది తప్ప, జగన్ ప్రభుత్వ చర్యల వల్ల కాదు.

పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎలా పూర్తవుతుందో జగన్ ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇవ్వలేదు
పోలవరం ప్రాజెక్ట్ ను ఎప్పుడు పూర్తిచేస్తారనేది కూడా ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగం లో చెప్పలేకపోయింది. గతంలో జగన్ రెడ్డి 2021, 2022, 2023, అని తేదీలు మార్చి చెబుతూ రైతుల్ని వంచించాడు. కర్నూలు, కడప జిల్లాల్లోని రైతులకు తాము నీళ్లు ఇవ్వలేమని చెప్పిన ప్రభుత్వం ఆ అంశాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఎందుకు చెప్పలేదు?

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై గ్రీన్ ట్రైబ్యు నల్ లో కేసులుంటే, ప్రభుత్వం దాన్ని పూర్తిచేస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్ప డం రైతుల్ని మోసగించడం కాదా? 2019 తర్వాత ఒక్క ఎకరాకైనా జగన్ రెడ్డి సర్కార్ నీళ్లిచ్చిందా? ఒక్క కిలోమీటర్ అయినా అదనంగా పంటకాలువలు తవ్విందా? కేవలం అంకెల గారడీ, అబద్ధాలతో ప్రజల్ని మోసగించడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప, వాస్తవాలు చెప్పలేదు.

ఇళ్లనిర్మాణం.. రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలే
కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయకుండా మోసగించిన జగన్ రెడ్డి, బడ్జెట్ ప్రసంగంలో వారిని ఉద్ధరించినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల న్నీ గుంతలమయం అయితే, బడ్జెట్ ప్రసంగంలో రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు. రోడ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వమిచ్చిన నిధుల్ని కూడా వైసీపీప్రభుత్వం దారిమళ్లించింది. పులివెందుల నియోజకవర్గానికి ఎక్స్ టర్న్ లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మాణానికి రూ.500కో ట్లు మంజూరైతే ప్రభుత్వం పనులు ప్రారంభించలేదు.

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద పులివెందుల నియోజకవర్గంలో 200కిలోమీటర్ల రోడ్ల నిర్మ ణానికి అనుమతులు లభిస్తే, ఆ పనులు కూడా ప్రారంభించలేదు. పాదయాత్రలో, ముఖ్యమంత్రి అయిన కొత్తలో సంవత్సరానికి 5 లక్షల ఇళ్లచొప్పున 5 ఏళ్లలో 25 లక్షలఇళ్లు నిర్మిస్తానని జగన్ రెడ్డి చెప్పాడు. బడ్జెట్ ప్రసంగంలో తన ప్రభుత్వం 21లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, వాటిలో 9లక్షల ఇళ్లనిర్మాణం పూర్తైందని చెప్పారు.

9లక్షలు కాదు.. రాష్ట్రంలో 9వేల ఇళ్లు నిర్మించారా? జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన నియోజకవర్గంలో ఎన్నిఇళ్లు నిర్మించాడో చెప్పాలి. జగనన్న ఇళ్లు కింద పులివెందుల నియోజకవర్గంలో 8వేల ఇళ్లు మంజూరైతే వాటిలో సగం కూడా పూర్తికాలేదు.

ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.1200కోట్లు బకాయిలు పెట్టడమేనా పేదల ఆరోగ్యాన్ని రక్షించడమంటే?
ఆరోగ్యశ్రీని అటకెక్కించిన జగన్ రెడ్డి దానిపై కూడా బడ్జెట్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలు చెప్పించాడు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వం తమకు రూ.1200కోట్లు బకాయిపెట్టిందని చెబుతుంటే, జగన్ రెడ్డి మాత్రం వైద్యసేవల్లో తామే నెంబర్ -1గా ఉన్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు. శాశ్వత భూహక్కు చట్టం పేరుతో పేదలకు చేసిన మంచేమిటో ముఖ్యమంత్రి చెప్పాలి.

పేదల భూము ల్ని అధికారపార్టీ నాయకులు తక్కువ ధరకు కొట్టేసి, ఇళ్లస్థలాల పేరుతో ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మింది నిజం కాదా? ఇలా అన్ని విషయాల్లో వాస్తవాలు దాచిన ప్రభుత్వం ఆత్మస్తుతి పరనిందలా బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించింది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జగన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన బడ్జెట్..దానికి సంబంధించిన ప్రసంగంపై సంతృప్తిగా లేరు.

వివేకానందుడి సూక్తి ప్రకారమే జగన్ రెడ్డికి ఓటేసినందు వల్లే ప్రజలు అష్టకష్టాలు, చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారు
వివేకానందుడి సూక్తితో జగన్ బడ్జెట్ ప్రసంగానికి ముగింపు పలికారు ఆయన చెప్పినట్టే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న స్థితికి, ప్రజలు అనుభవిస్తున్న దుర్మార్గపు పాలనకు కారణం ఆయనే. ఆయన్ని గెలిపించడంద్వారా ప్రజలు కూడా ఒకరకం గా ఈ దుర్మార్గపు పాలనకు కారకులే. జగన్ రెడ్డిని నమ్మినందుకు అతని దుర్మార్గపు పాలనకు ప్రజలే కారకులని ఆయనే ఒప్పుకున్నాడు. అలానే భవిష్య త్ లో ఎలా ఉండాలో కూడా ప్రజలే నిర్ణయించుకోవాలని జగన్ రెడ్డి సూచించాడు.

చారిత్రాత్మకమైన తీర్పు ద్వారా ప్రజలు 60 రోజుల తర్వాత దుర్మార్గపు పాలనకు అంతంపలికి, తమను.. రాష్ట్రాన్ని కాపాడే ప్రభుత్వానికి పట్టం కట్టాలి. ఎన్నికల్లో లబ్ధి కోసమేజగన్ రెడ్డి ఇప్పుడు కేవలం 6,100 పోస్టులతో డీఎస్సీని విడుదల చేశాడు. లక్షల్లో ఉద్యోగాలు భర్తీచేస్తానని ప్రగల్భాలు పలికిన వ్యక్తి వేలల్లో నోటిఫికే షన్లు ఇవ్వడం నిరుద్యోగయువతను వంచించడం కాదా?” అని రామ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు.

టీడీపీప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు, కంపెనీలు తరిమేసిన జగన్ రెడ్డి, చివరకు చంద్రబాబు యువతకోసం ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు మూసేయించి, నిరుద్యోగ భృతి తీసేసి రాష్ట్ర యువత నోట్లో మట్టి కొట్టా డు : కంచర్ల శ్రీకాంత్
“ శాసనసభలో, శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అవాస్త వాలు, అంకెల గారడీకి ప్రతిరూపంగా నిలిచింది. యువతకు ఏ రకంగా ఉద్యోగావ కాశాలు కల్పించామో చెబుతూ ప్రభుత్వం దారుణంగా అబద్ధాలు చెప్పింది. జగన్ రెడ్డి.. అతని ప్రభుత్వం మాదిరి దేశంలో ఎవరూ అబద్ధాలు చెప్పలేరు. జగన్ రెడ్డి సర్కార్ ఐదేళ్లలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా కేవలం లక్షా 6వేల మంది యువతకి మాత్రమే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చింది. వారిలో ఎందరికి ఉద్యోగాలు ఇచ్చారంటే సమాధానం లేదు.

కానీ టీడీపీప్రభుత్వం ఐదేళ్లలో 2.13లక్షల మందికి శిక్షణ అందించి, వారిలో 64వేల మందికి ఉపాధి కల్పించింది . సీమెన్స్ సంస్థతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో టీడీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాలపై నిందలు వేసి, స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లోఅవినీతి జరిగిందంటూ జగన్ రెడ్డి సర్కార్ చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసులు పెట్టింది. యువత భవితకు బంగారు బాటలు వేసే స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్ని నిరుపయోగంగా మార్చింది.
తన పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమలు.. కంపెనీలు ఎన్ని? కల్పించిన ఉద్యోగాలెన్ని?

జనవరిలో జాబ్ క్యాలెండర్, ఏటా మెగాడీఎస్సీ, 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రస్తావన బడ్జెట్ ప్రసంగంలో ఎందుక లేదో జగన్ నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి
రాష్ట్రానికి పరిశ్రమలు, కంపెనీలు తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంటోంది. జగన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు, పరిశ్రమలెన్ని..యువతకు కల్పించిన ఉద్యోగాలు ఎన్ని? చంద్రబాబు నాయుడు గతంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణకు బాటలు వేశారు. రాయలసీమ ప్రాంతంలో మోటార్స్, ఎలక్ట్రానిక్స్ సెల్ ఫోన్ తయారీ యూనిట్ల వంటివి ఏర్పాటు చేశారు.

అనంతపు రం జిల్లాలో కియామోటార్స్, తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో సెల్ కాన్ ఫోన్ల తయారీ యూనిట్, అనేకరకాల ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. దానిలో టీసీఎల్, జోహో వంటి పెద్దపెద్ద కంపెనీలు ఏర్పాటయ్యాయి. చంద్రబాబు కియా పరిశ్రమను తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్షంలోఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆనాడు దక్షిణకొరియాలో మూతపడిన కియా కార్లసంస్థను ఏపీకి తీసుకొచ్చార న్నారు.

కానీ ఏపీలో ప్రారంభమైన కియా పరిశ్రమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2వేలకోట్ల ఆదాయం రావడం, అనంతపురం జిల్లాలో వేలాది యువతకు ఉపాధి లభించడం జరిగింది. అదే కియామోటార్స్ సంస్థ ఈ ప్రభుత్వంలో అనుబంధపరిశ్రమల ఏర్పాటుకోసం వైసీపీనేతలకు కప్పం కట్టలేక ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకుంది. రిలయన్స్ సంస్థ తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్స్ యూనిట్స్ ఏర్పాటుచేయడం కోసం చంద్రబాబు నాయుడి హాయాంలో భూములు కేటాయిస్తే, జగన్ రెడ్డి వచ్చాక జరిగిన పరిణామాలతో రిలయన్స్ సంస్థ భూములు వెనక్కు ఇచ్చేసి వెళ్లిపోయింది నిజం కాదా?

శ్రీ సిటిలో టీడీపీ హాయాంలో ఏర్పాటైన సెల్ కాన్ ఫోన్ల తయారీ సంస్థ, జగన్ రెడ్డి, వైసీపీనేతల గొంతెమ్మ కోరికలు తీర్చలేక చెన్నైలో తమసంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది వాస్తవం కాదా? విశాఖపట్నంలో టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన 18కంపెనీలు జగన్ రెడ్డి వచ్చాక రాష్ట్రానికి గుడ్ బై చెప్పింది నిజం కాదా? లులూ గ్రూప్, ఫాక్స్ కాన్, హెచ్.ఎస్.బీ.సీ వంటి సంస్థలు జగన్ రెడ్డి దెబ్బతో తెలంగాణకు తరలిపో యింది నిజం కాదా?

ఇలా ఏపీలో ఏర్పాటైన కంపెనీలు, పరిశ్రమల్ని తరిమేసి రాష్ట్రయువతకు అన్యాయం చేసిన జగన్ రెడ్డి సిగ్గులేకుండా ఉద్యోగాలు ఇచ్చా మని గొప్పలు చెప్పుకుంటున్నాడు. అధికారంలోకి వచ్చాక యువతకు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను.. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్ రెడ్డి హామీల ప్రస్తావన బడ్జెట్ ప్రసంగంలో ఎందుకు లేదు? ఏటా మెగా డీఎస్సీ నిర్వహిస్తానన్న జగన్ రెడ్డి.. పాదయాత్ర సమయంలో 26వేల ఉపా ధ్యాయ పోస్టులు ఖాళీగాఉన్నాయని చెప్పిన జగన్ రెడ్డి, కంటితుడుపు చర్యగా ఇప్పుడు కేవలం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ఇవ్వడం నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లడం కాదా?

గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు ఇప్పటివరకు ఇవ్వకుండా కాలయాపన చేసిన జగన్ రెడ్డి, ఎన్నికల ముందు హడావుడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో ఇన్నేళ్లుగా కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డా రు. కేవలం 79 రోజుల వ్యవధిలో గ్రూప్స్ నోటిఫికేషన్ ఇవ్వగం జగన్ రెడ్డి ఎన్నికల స్టంట్ అనే చెప్పాలి.

జగన్ రెడ్డి చేసిన మోసంతో రాష్ట్రంలో 2019 నుంచి 2023 వరకు వేలమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. టీడీపీ ప్రభుత్వం నెలకు రూ.3వేల చొప్పున 6లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి అందిస్తే, జగన్ రెడ్డి అధికారంలోకి రాగనే దాన్ని రద్దు చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతను జగన్ రెడ్డి దారుణంగా వంచిం చాడు.

ప్రత్యేకహోదా, ఉద్యోగాల కల్పన పేరుతో యువతను, నిరుద్యోగుల్ని వంచించిన జగన్ రెడ్డి వారి పాలిట ద్రోహి కాడా?
అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ రెడ్డి మాటలు నమ్మి గత ఎన్నికల్లో యువత వైసీపీకి ఓట్లేసింది. కానీ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ రెడ్డి తన కేసులనుంచి బయటపడటానికి కేంద్రపెద్దల ఎదుట తానే మెడలు వంచాడు. చివరకు రాష్ట్రాన్ని గంజాయి, మాదకద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చి నిరుద్యోగ యువతను మత్తులో ముంచాడు.

ఇంత దారుణ చర్యలకు పాల్పడిన జగన్ రెడ్డి నిరుద్యోగ యువత పాలిట ద్రోహి కాడా అని ప్రశ్ని స్తున్నాం. టీడీపీ ప్రభుత్వం రాగానే యువతకు 20లక్షల ఉద్యోగాలుఅందిస్తుంది అని ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. అలానే మెగా డీఎస్సీ, గ్రూప్స్ నోటిఫికేష న్లు ప్రకటించి, రాష్ట్రయువతకు చంద్రబాబు న్యాయం చేస్తారు.” అని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

వైసీపీప్రభుత్వంలో ఏ బడ్జెట్ చూసినా ఏమున్నది గర్వకారణం.. అవాస్తవాలు, అంకెల గారడీ.. అభూత కల్పనల మేళవింపు తప్ప: వేపాడ చిరంజీవి రావు
“ ఉభయసభల్లో ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అది చూశాక నాకు శ్రీశ్రీ చెప్పింది గుర్తొచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో ఏ బడ్జెట్ చూసినా ఏమున్నది గర్వకారణం… అవాస్తవాలు, అంకెల గారడీ, అభూతకల్పనల మేళవింపు తప్ప అనిపించింది. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే, ప్రజలకు మేలుచేసే ఒక్క అంశం కూడా జగన్ రెడ్డి సర్కార్ ఇన్నేళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో లేదు. విద్య, వైద్యం, ఉద్యోగ, వ్యవసాయం, పారిశ్రామికరంగం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో చూస్తూనేఉన్నాం. ప్రభుత్వం నేటి బడ్జెట్లో సామర్థ్య ఆంధ్రా అనే ప్రస్తావన చేసింది. ముఖ్యమంత్రి సహా, వైసీపీ నేతల దోపిడీసామర్థ్యం పెరిగిందని అలా చెప్పిందా?

నాడు-నేడు మొదటి దశ పనులే పూర్తి కాకుండా విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ఎలా అందుతాయో ముఖ్యమంత్రి చెప్పాలి
విద్యా రంగానికి సంబంధించి జగన్ తీసుకొచ్చిన విధానాలు అన్నీ అస్తవ్యస్తం.. లోప భూయిష్టమే. విదేశీభాషల్ని కూడా ప్రభుత్వపాఠశాలల్లో బోధిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. కానీ ఎవరు బోధిస్తున్నారో చెప్పలేదు. ఆంగ్లభాషపై మంచి పట్టున్నవారు విదేశీభాషల్ని విద్యార్థులకు బోధించాలి. కానీ వాస్తవంలో తెలుగు, సైన్స్, లెక్కలు, సోషల్ ఉపాధ్యాయులే ఆంగ్లాన్ని బోధిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం జగన్ రెడ్డి సర్కార్ కాదా?

నూతన విద్యావిధానం 2022ను అమలు చేసి నట్టు ప్రభుత్వం చెప్పుకుంది. వాస్తవంలో నూతన విద్యావిధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలే దాన్ని అమలు చేయలేదు. జగన్ తీసుకొచ్చిన నూతన విధ్యావిధానంతో ప్రాథమిక పాఠ శాలలు నిర్వీర్యమైపోయాయి. పేదవిద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి.

జగన్ రెడ్డి గొప్పగా చెప్పుకునే నాడు-నేడు పథకం ఎక్కడా పూర్తిగా అమలుకాలేదు. నాడు-నేడు తొలిదశ పనులే రాష్ట్రంలోఎక్కడా సరిగా పూర్తి కాలేదు. జగనన్న గోరుముద్దలు అంటున్నారు. కానీ చిన్నారులకు అందించే భోజనంలో కుళ్లిన కోడిగుడ్లు, పాముకళేబరాలున్న ఖర్జూరాలు, పురుగు పట్టిన చిక్కీలు అందించడమేనా గోరుముద్దలు పెట్టడం అంటే?

ప్రొఫెసర్లు లేకుండా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఎలా పొందుతాయో జగన్ రెడ్డే చెప్పాలి
రాష్ట్ర విశ్వవిద్యాలయాలను కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ స్థాయికి తీసుకెళ్లామంటున్నా రు. జగన్ రెడ్డి హాయాంలో ఐదేళ్లలో విశ్వవిద్యాలయాల్లో ఒక్క ప్రొఫెసర్ ను కూడా నియమించింది లేదు. ప్రొఫెసర్లు లేకుండా అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు విశ్వ విద్యాలయాల్లో ఎలా వస్తాయో ముఖ్యమంత్రే చెప్పాలి.

జగన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యారంగంలో సరైన విద్యాప్రమాణాలు అనుసరించకపోవడంతో రాష్ట్రం దేశంలోనే విద్యాప్రమాణాల అమల్లో 19వ స్థానానికి పడిపోయింది. పట్టభద్రుల నిరుద్యోగ శాతంలో కూడా ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇవన్నీ చూశాక ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ నిరుద్యోగులు, యువత వ్యతిరేక బడ్జెట్ అనే చెప్పాలి.

చంద్రబాబునాయుడు 5వేల మందికి విదేశీవిద్యపథకం కింద ఆర్థికసాయం అందిస్తే, జగన్ రెడ్డి కేవలం 350 మందికి సాయంచేసి, చేతులు దులుపుకున్నా డు చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకోసం తీసుకొచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను జగన్ రెడ్డి రద్దుచేసింది నిజంకాదా?

టీడీపీప్రభుత్వంలో చంద్రబాబునాయడు విదేశీవిద్య పథకం కింద విదేశాల్లో చదువుకునే 5వేల మంది తెలుగు విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తే, జగన్ రెడ్డి కేవలం 350 మందికి మాత్రమే అరకొర సాయం అందించింది. టీడీపీ హాయాంలో ఏర్పాటైన బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను కూడా జగన్ రెడ్డి రద్దు చేశాడు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గొప్పమేలు చేసినట్టు కూడా బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం గొప్పులు చెప్పుకుంది. నాలుగేళ్ల 10నెలలు అయినా ఇచ్చిన హామీ ప్రకారం జగన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదో చెప్పాలి. సీపీఎస్ రద్దు హామీ ఏమైందో,ఉద్యోగులు…ఉపాధ్యాయులకు డీఏలు ఎందుకు బకాయిపెట్టారో చెప్పాలి. ఉద్యోగుల సంక్షేమం కోసం తన ప్రభుత్వం 27శాతం ఐఆర్ చెల్లించినట్టు జగన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. కానీ వాస్తవంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రచరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఐఆర్ 27శాతం ప్రకటించి, ఫిట్ మెంట్ 23 శాతం ప్రకటించింది.

జగన్ రెడ్డి ప్రకటించిన కొత్త పీఆర్సీ తమకు వద్దని, పాత పీఆర్సీనే అమలుచేయాలని లక్షలాది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చింది నిజం కాదా? ఆశావర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచినట్టు బడ్జెట్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పారు. లక్షా25వేల మంది అంగన్ వాడీ సిబ్బందిపై ఎస్మా ప్రయోగించడమేనా జగన్ రెడ్డి వారికి ఇచ్చిన బహుమతి ? అంగన్ వాడీ సిబ్బంది జీతాలు జూన్ లో పెంచుతామని ప్రభుత్వం చెప్పడం తప్పించుకోవడం కాదా? ఐదేళ్లలో పోలీస్ ఉద్యోగాల భర్తీపై ఎందుకు ఆలోచించలే దో జగన్ రెడ్డి చెప్పాలి.

అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పథకాలు ప్రకటిస్తే చిత్తశు ద్ధి అని, ఎన్నికలకు 6 నెలల ముందు ప్రకటించడం మోసగించడమని చెప్పిన జగన్ రెడ్డి, ఇప్పుడు 6,100ఉద్యోగాలభర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం ఏమిటి? నెలరోజుల క్రితం గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఇవ్వడం యువ తను మోసగించడం కాదా?

ప్రభుత్వ..వైసీపీనేతల వేధింపులు తట్టుకోలేక వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడుతోంది నిజం కాదా? విశాఖపట్నంలో తహసీల్దార్ హత్యకు ప్రభుత్వం కారణం కాదా?
ప్రభుత్వ వేధింపులు, వైసీపీనేతల ఒత్తిళ్లు తట్టుకోలేక వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నది నిజం కాదా? తూర్పుగోదావరి జిల్లా లో రైతు భరోసా కేంద్రంలో పనిచేసే వ్యవసాయశాఖ సహాయకురాలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? విశాఖపట్నంలో తహసీల్దార్ ను ఎందుకు దారుణంగా చంపారో కూడా ముఖ్యమంత్రి చెప్పాలి.

సచివాలయ ఉద్యోగులకు విధినిర్వహణ కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి జాబ్ ఛార్ట్ ప్రకటించలేదు. లక్షా 25వేల సచి వాలయసిబ్బంది, మహిళా పోలీసులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమకు ఉద్యోగాలు ఇచ్చింది తాము బతకడానికా..లేక వైసీపీనేతలకు ఊడిగం చేయడానికా అని వారంతా వాపోతున్నారు.

వ్యవసాయరంగాన్ని ప్రభుత్వం నిజంగా బలోపేతం చేస్తే, ఆహారధాన్యాలు, అపరాల సాగు విస్తీర్ణంలో దేశంలో రాష్ట్రం ఎందుకు వెనుకంజలో ఉంది?
వ్యవసాయరంగాన్ని ప్రభుత్వం బలోపేతంచేస్తే, రైతులకు నిజంగా మేలు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆహారధాన్యాలు ఇతర అపరాల సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గిపోయిందో చెప్పాలి. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే ముందువరసలో ఎందుకు ఉందో జగన్ రెడ్డి నోరువిప్పాలి. గతంలో విశాఖపట్నానికి ఒక విమానాశ్ర యం ఉంటే, భోగాపురంలో మరో విమానాశ్రాయం ఎందుకు అన్నారు.

అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభించి, గొప్పలు చెప్పుకున్నాడు. ఇలా చంద్రబాబు హయాంలో ప్రారంభించిన అనేక ప్రాజెక్టుల్ని జగన్ రెడ్డి మరలా ప్రారంభించాడు తప్ప, కొత్తగా తాను తీసుకొచ్చింది ఏవీలేవు.

వైసీపీప్రభుత్వం మూలధన వ్యయానికి తక్కువ నిధులు కేటాయిస్తూ, వాటిని కూడా ఖర్చుపెట్టడంలేదు. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేవలం 10శాతం నిధులే మూలధన వ్యయం కింద చూపారు. 90శాతం రెవెన్యూ వ్యయం కింద చూపారు
రాష్ట్ర బడ్జెట్ లో ప్రధానంగా చూడాల్సింది రెవెన్యూ వ్యయం.. మూలధన వ్యయం. రెవెన్యూ వ్యయం అంటే ఆస్తులు నిర్మించుకుంటూ చేసే వ్యయం. మూలధన వ్యయం అంటే ఆస్తుల సృష్టికోసం చేసే వ్యయం. గత బడ్జెట్లో ప్రభుత్వం ఎంతైతే మూలధన వ్యయం కేటాయించిందో ఆ మొత్తాన్ని ఆస్తుల కల్పన కోసం ఖర్చు పెట్టలేకపోయారు. గత బడ్జెట్లో ప్రభుత్వం రూ.31వేలకోట్లు మూలధనవ్యయంగా కేటాయిస్తే, దానిలో కేవలం రూ.27వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు.

తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ మొత్తం బడ్జెట్ రూ.2.86లక్షల కోట్లుగా చెప్పారు. ఆ మొత్తంలో మూలధన వ్యయం ఎంతంటే కేవలం 10శాతం మాత్ర మే. మిగతా 90శాతం రెవెన్యూ వ్యయమే. గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించి, మూలధన వ్యయంలో చిట్టచివరన నిలిచిన రాష్రంాప ఆంధ్రప్రదేశ్ అని తేల్చింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర జీ.ఎస్.డీ.పీ (ఆదాయం) కంటే ఏపీ జీ.ఎస్.డీ.పీ అధికంగా ఉండేది.

వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల నేడు తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరిగి, ఏపీ ఆదాయం తగ్గిపోయింది. 4ఏళ్ల 10 నెలల్లో మొత్తంగా జగన్ రెడ్డి సర్కార్ రూ.12 లక్షల కోట్ల అప్పులు చేసింది. టీడీపీప్రభుత్వంతో పోలిస్తే జగన్ రెడ్డి చేసిన అప్పులు 4 రెట్లు ఎక్కువ. ప్రజలకు అందిన అభివృద్ధి సంక్షేమం మాత్రం చాలా తక్కువ. వృద్ధిరేటుపై కూడా వైసీపీప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో వృద్ధిరేటు 13.49శాతం ఉంటే, ఇప్పుడు కేవలం 11 శాతమే ఉంది.

చేసిన అప్పులకు ప్రతి సంవత్సరం జగన్ రెడ్డి సర్కార్ రూ.28వేల కోట్లు చెల్లించాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల్ని కూడా జగన్ ప్రభుత్వం దారిమళ్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కేటాయించాల్సిన పథకాలకు కేటాయించకుండా ఇతరపనులకోసం దుర్వినియోగం చేయడంతో కేంద్రం మొత్తంగా నిధులు ఇవ్వడమే ఆపేసింది. ఒకప్పుడు విద్య, వైద్యం, అభివృద్ధిలో ముందంజ లో ఉన్న రాష్ట్రన్ని జగన్ రెడ్డి 4ఏళ్ల 10నెలల్లో అన్నిరంగాల్లో అథోగతిపాలు చేశాడు.” అని చిరంజీవిరావు తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE