మాకు నీళ్లు ఆపేసారు సార్

– గిరిజన మహిళ
-ఫోన్ కొట్టు అమ్మ .. జగన్ రెడ్డికి, ఈ వైసీపీ ప్రభుత్వానికి నిలదీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది
– ఎరిక్షన్ బాబు

పుల్లలచెరువు మండలం ఉమ్మడివరం గ్రామంలోని చెంచు కాలనీలో గత నాలుగు రోజులుగా నీటి ట్యాంకర్ ను ఆపివేశారని తాము నీటి ఇబ్బందితో అవస్థలు పడుతున్నామని యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ముందు ఓ గిరిజన మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ… ఈ జగన్ రెడ్డి తోలని నీటి ట్యాంకర్లను కూడా తోలినట్లు వారి వైసీపీ నాయకులే బిల్లులు చేసుకుంటున్నారని అందుకే ఆపేశాడని తెలిపారు. జగన్ రెడ్డికి ఫోన్ కొట్టి ఎందుకు ఆపేశారని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. త్వరలో తాను నియోజకవర్గ నీటి సమస్యపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, నీటి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ఎరిక్షన్ బాబు వారికి తెలిపారు.

Leave a Reply