Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల రామకృష్ణారెడ్డి కబంధ హస్తాలలో మన్యం జిల్లా గిరిజనులు

-కుంభ రవిబాబును ఏజెంట్‌గా పెట్టుకొని అందాల మన్యంలో అక్రమ మైనింగ్
-వైసీపీ నాయకుల ఆసరాతో విచ్చలవిడి గంజాయి స్మగ్లింగ్, అక్రమ వ్యాపారాలు
– ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్

రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల 10 నెలల కాలం నుంచి సైకో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు విధ్వంసాలు గిరిజనులకు శాపంలా మారాయని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి ప్రసాద్ మండిపడ్డారు. సజ్జల కార్యకాలాపాలు మన్యం జిల్లాలో గిరిజనులను కలవరపేడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మన్యం జిల్లాలో అక్రమ మైనింగ్ పేట్రేగిపోతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి మైదాన ప్రాంతం నుంచి గిరిజన వైసీపీ నాయకుడైన కుంభ రవిబాబును తన ఏజెంట్ గా నియమించుకుని అధికారిక పదవులు ఇచ్చి ఆయన ద్వారా తన అక్రమ మైనింగ్‌ను యధేచ్ఛగా నిర్వహిస్తున్నాడని నరహరి వరప్రసాద్ ఆరోపించారు. గిరిజన జాతిని అభివృద్ధి పథంలో నడిపించడానికి గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి వారి ఉన్నత స్థితిని మెరుగుపరచడానికి అధికారక పదవులు ఇస్తే, ఆ పదవులను అనుభవిస్తూ సజ్జల రామకృష్ణా రెడ్డికి ఊడిగం చేస్తూ గిరిజన జాతికి ద్రోహం చేస్తున్నాడని ఎమ్మెల్సీ కుంభ రవిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా గిరిజనులు ఎంతవరకు అభివృద్ధి చెందారన్న దానిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అమాయక గిరిజన యువతను గంజాయి కేసుల్లో చిక్కుకునిపోతే గిరిజన ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాడని అన్నారు. ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు జీవో నెం 3 ను కొట్టివేస్తే కనీసం ఆప్పీలుకు వెళ్లలేదని వైసిపి ప్రభుత్వం మండిపడ్డారు. గిరిజన యువతని దృష్టిలో ఉంచుకుని వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించి వారి జీవనోపాధిని మెరుగుపరిచే సదుద్దేశంతో అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 3 ని తీసుకువచ్చింది.

అది ఆసరాగా చేసుకుని ఎంతో మంది యువత లబ్ది పొందేవారు. కానీ ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వంలో అమాయక గిరిజన యువత ఈ నయవంచక ప్రభుత్వ సలహాదారు చెరలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన్యం జిల్లాలోని అమాయక గిరిజన యువత వేరే గత్యంతరం లేక వైసిపి పెద్దల నిర్వహిస్తున్న గంజాయి స్మగ్లింగ్ తరలింపుల్లో చిక్కుకుని పోలీసు నిర్బంధాలలో, చెరసాలలో మగ్గిపోతున్నారని, వారికి బెయిలు కూడా మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోడి కత్తి కేసులో శ్రీనుకు ఇప్పటివరకు కనీసం బెయిలుకు నోచుకోలేదు దానికి కారణం జగన్ రెడ్డి కుట్ర కాదా అని ప్రశ్నించారు.

కోడి కత్తి శ్రీనుకు ఎలా అయితే అన్యాయం జరిగిందో విశాఖ మన్యంలో వైసీపీ నాయకుల అధ్వర్యంలో గంజాయి తరలింపు వ్యవహారంలో చిక్కుకున్న గిరిజన యువతకు కూడా అలాంటి అన్యాయమే రాష్ట్రంలో జరుగుతుందన్నారు. గిరిజన జాతికి సమర్ధవంతమైన నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం లో లోపించింది. రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా వెనువెంటనే ఎమ్మెల్సీగా నియమిస్తే వైసిపి పెద్దల అడుగులకు మడుగులు ఒత్తుతూ గిరిజన జాతిని గాలికి వదిలేసిన మిమ్మల్ని గిరిజన ప్రజలు క్షమించరని నరహర ప్రసాద్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

రాష్ట్ర ప్రజలందరూ నమ్మి ఓట్లేసిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి తాడేపల్లి ప్యాలెస్‌లో ఇసుక మద్యం వ్యాపారాలను తన బినామీలతో చేయిస్తూ డబ్బు దండుకుంటున్నాడు. జగన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తులూ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు తన అక్రమ మైనింగ్ వ్యాపారాలను నిర్వహిస్తూ అరకు ఫామ్ హౌస్ లో కూర్చొని అవినీతి డబ్బు కూడగడుతున్నాడని ఆరోపించాడు.

మైదాన ప్రాంతం నుంచి అధికారిక పదవులు ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మరియు ఎమ్మెల్సీ గా తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ తన అక్రమ మైనింగ్ వ్యాపారాలలో డబ్బులు గడించేందుకు ఉపయోగించుకుంటూ గిరిజన జాతికి అన్యాయం చేస్తున్న కుంభ రవిబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని, తనకు లభించినటువంటి అధికారంతో గిరిజనుల అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్రంలోని ఒక్క జిల్లాలోనైనా సమీక్ష నిర్వహించారా రివ్యూ మీటింగ్ లు ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు . గిరిజన జాతికి తీవ్ర అన్యాయం చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ కుంభ రవిబాబు తక్షణమే రాజీనామా చేసి రాష్ట్ర గిరిజనులకు క్షమాపణ చెప్పాలని నరహరి వర ప్రసాద్ డిమాండ్ చేశారు

LEAVE A RESPONSE