సమాధులపైన కూడా జగన్ రెడ్డి ఫోటోలు వేసుకుంటున్నాడు

– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
– ప్రజల హక్కులను హరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం తక్షణమే రీకాల్ చేయాలని మచిలీపట్నం జిల్లా బార్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర

కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… నూతన చట్టం ఏకపక్షంగా రాత్రికి రాత్రి తీసుకురావడంతో దీన్ని చీకటి చట్టంగా అభివర్ణించారు. సివిల్ కోర్టు యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రజల భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వం చే నియమించిన అధికారికి అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు హైకోర్టుకు వెళ్లాలనే నిబంధన ఆ చట్టంలో పెట్టడం వల్ల న్యాయం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని పేర్కొన్నారు.

ఇప్పటికే 41ఎ నోటీసు ద్వారా క్రిమినల్ కేసులలో వృత్తిని కోల్పోయిన న్యాయవాదులు నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ టైటిలింగ్ యాక్ట్ జీ.వో.512/23 వలన సివిల్ కోర్టు పరిధి కూడా పూర్తిగా తగ్గిపోతుందని తెలియజేశారు. తద్వారా న్యాయ వ్యవస్థ యొక్క పవిత్రతను కోల్పోతామని )న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం ఈ విధమైన చీకటి చట్టాలు తీసుకురావడం అన్యాయమని పేర్కొన్నారు. తక్షణమే ఈ సమస్యను టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో దీనికి పరిష్కారం మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply