ఆ అధికారిణి దారుణాలు అంతింత కాదయా!

0
91

-ట్విట్టర్లో టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు…

మంగళగిరి నియోజకవర్గంలో ఆ అధికారిణి దారుణాలు అంతింత కాదయా! స్థానిక ఎమ్మెల్యే తో కుమ్మక్కై మూడేళ్లుగా ఒకే చోట పోస్టింగ్. ఆర్కే రైట్ హ్యాండ్ గా మారి పేదల ఇళ్లు కూల్చడం, పేదల నోటి దగ్గర కూడు లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారు మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ హేమ మాలిని రెడ్డి. పేదల ఇళ్లు, అన్న క్యాంటీన్లు కూల్చే ఆమెకి నియోజకవర్గంలో వైసిపి నాయకులు చెరువులను సైతం కబ్జా చేసి భవనాలు కడుతున్నా కనపడకపోవడం వింతే. స్థానిక ఎమ్మెల్యే తో కలిసి ఆమె చేస్తున్న అవినీతికి అంతే లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హేమ మాలిని రెడ్డి అక్రమాస్తులపై విచారణ చేయడం వాటిని ఇదే జెసిబి తో కూల్చడం ఖాయం. మంగళగిరిలో టిడిపి ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్ ముందే హేమ మాలిని రెడ్డితో పేదలకు సేవ చేయించడం తథ్యం.