ఎన్టీఆర్ స్పూర్తితో టిడిపిని అధికారంలోకి తేవాలి!

-ఎన్ఆర్ఐ యుఎస్ఎ కోఆర్డినేటర్ కోమటి జయరాం
-చికాగోలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

ఎన్టీఆర్ స్ఫూర్తితో టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని ఎన్ఆర్ఐ యూఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ కలలుకన్న అభివృద్ధి, సంక్షేమ రాజ్యం రావాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. చికాగోలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన నాలుగో మహానాడుకు జయరాం కోమటి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు,  దేవినేని ఉమామహేశ్వరరావు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ..
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరంగా ప్రవాసాంధ్రులు భావిస్తున్నారు. ప్రస్తుత2 పాలకులపై నమ్మకం లేక పెట్టుబడులు ఆగిపోయాయి. అభివృద్ధి కుంటుపడిపోయింది. అమరావతి రాజధానిలో అనేక పరిశ్రమలు స్థాపించేందుకు ప్రవాసాంధ్రులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ..
 రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే పెద్దఎత్తున దాడులకు దిగుతున్నారని అన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లేదీసే పరిస్థితి నెలకొంది. పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను అడ్డుకోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు.

గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ..
 సమాజాన్ని జగన్ రెడ్డి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మత, ప్రాంతాల పరంగా విభజించి పాలిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రవాసాంధ్రులపై ఉందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

కార్యక్రమాన్ని చికాగో టీడీపీ సీనియర్ నాయకులు హేమ కానూరు సమన్వయ పరిచగా, సీనియర్ నాయకులు కాట్రగడ్డ రామకోటేశ్వరరావు, శ్రీలత గరికపాటి, చాందిని దువ్వూరి, వాసవి చక్కా, పొట్లూరి దేవీప్రసాద్, రవి కాకర, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, చిరంజీవి గళ్ల, కృష్ణమోహన్, శ్రీనివాస్ పెదమల్లు, శ్రీహరి కట్టా, ప్రవీణ్ వేములపల్లి, మదన్ పాములపాటి, మహేష్ కాకరాల, వినోజ్ తదితరులు పాల్గొన్నారు.