(కృష్ణ)
వక్ఫ్ బిల్లుపై ముస్లిం సమాజం పక్షాన నిలిచిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ముస్లిం మైనారిటీల హక్కుల పరిరక్షణకు టీడీపీ చేస్తున్న నిరంతర కృషికి ఈ వక్స్ బిల్లులో ఆమోదించిన సవరణలు ఒక నిదర్శనం.
1. ముస్లిం సమాజం మనోభావాలను గౌరవిస్తూ, వక్స్ బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
2. టీడీపీ డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, జగదాంబికా పాల్ అధ్యక్షతన 31 మంది సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేసింది. ఈ జేపీసీలో తెలుగు రాష్ట్రాల ప్రతినిధులుగా తెలంగాణ నుండి అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం), డి. కె. అరుణ (బీజేపీ), ఆంధ్రప్రదేశ్ నుండి లావు శ్రీ కృష్ణ దేవరాయలు (టీడీపీ), విజయసాయి రెడ్డి (వైసీపీ) సభ్యులుగా ఉన్నారు.
3. ఈ కమిటీ వక్ఫ్ సంబంధిన 284 మందితో చర్చలు జరిపింది. ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, కోల్కతా, లక్నో వంటి నగరాల్లో సమావేశం అయ్యింది. మూడు అధ్యయన పర్యటనలు చేసింది. వక్స్ బోర్డులు, ప్రభుత్వాలు, మైనారిటీ కమిషన్ల అభిప్రాయాలను సేకరించింది.
4. జేపీసీ 38 సార్లు సమావేశమైంది. ఈ సమావేశాలకు అసదుద్దీన్ ఒవైసీ 14 సార్లు, డి.కె. అరుణ 12 సార్లు, లావు శ్రీ కృష్ణ దేవరాయలు 11 సార్లు హజరయ్యారు. విజయసాయి రెడ్డి కేవలం 4 సమావేశాలకు మాత్రమే హాజరై, చివరి సమావేశానికి ముందే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
5. ముస్లిం మైనారిటీల మనోభావాలను గౌరవిస్తూ, వక్ఫ్ బిల్లుపై వారి ఆందోళనలను తెలుసుకోవడానికి జీపీసీ సభ్యుడు లావు కృష్ణ దేవరాయలు దేశవ్యాప్తంగా విస్తృత సంప్రదింపులు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని కలిసి, రాష్ట్రంలోని మైనారిటీ పెద్దలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
6. వక్స్ హెూదా, కలెక్టర్ అధికారాలు, వక్ఫ్ బోర్డు నిర్మాణం, ట్రిబ్యునల్ అధికారాలు వంటి కీలక అంశాలపై ముస్లిం మైనారిటీల ఆందోళనలను, మనోభావాలను లావు శ్రీ కృష్ణ దేవరాయలు జేపీసీ దృష్టికి తీసుకువెళ్లారు.
7. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రతినిధులతో కూడిన ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేసి, జేపీసీని కలిసి రాష్ట్రం తరపున పలు ముఖ్యమైన సవరణలను ప్రతిపాదించారు. జేపీసీ సభ్యులు గంటకు పైగా ముస్లిం పెద్దల అభిప్రాయాలను శ్రద్ధగా విన్నారు.
8. దేశవ్యాప్తంగా జేపీసీకి మొత్తం 44 సవరణలు రాగా, వాటిలో 14 సవరణలను జేపీసీ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నియమించిన కమిటీ ప్రతిపాదించిన 5 సవరణలను జేపీసీ ఆమోదించడం తెలుగుదేశం పార్టీ కృషికి తార్కాణం.
9. తెలుగు రాష్ట్రాల తరపున జేపీసీలో ప్రాతినిధ్యం వహించే అవకాశం వైసీపీకి వచ్చినా.. ముస్లింల అభిప్రాయాలను వినడానికి కూడా జగన్ ఇష్టపడలేదు. భయంతో, యలహంకలో తలదాచుకున్నారు.
10. జేపీసీ సమావేశాలకు డుమ్మా కొడుతూ.. చివరి జేపీసీ సమావేశానికి ముందే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ముస్లిం సమాజానికి ద్రోహం చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీల పక్షాన నిలబడి, వారి హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేసింది. ముస్లిం సమాజం పట్ట (టీడీపీకి ఉన్న నిబద్ధతను ఇది నిదర్శనం.