ఉత్తరాంధ్రలో గిరిజన ఓట్లే లక్ష్యంగా టిడిపి పర్యటనలు

– శృంగవరపుకోటలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్
– సమావేశంలో పాల్గొన్న శృంగవరపు టీడీపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి
-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా కొండారెడ్డి నరహరి వరప్రసాద్

శృంగవరపుకోట: తెలుగుదేశం పార్టీ శృంగవరపుకోట ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి కార్యాలయంలో బుధవారం గిరిజన నాయకులు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ గిరిజన విభాగం ఉపాధ్యక్షురాలు దాసరి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా!! కొండారెడ్డి నరహర ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలలోని గిరిజన గ్రామాలను, గిరిజన ప్రాంతాలను సందర్శించిన మాజీ సభ్యులు వైసిపి ప్రభుత్వంలో గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలను విని వాపోయారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పార్టీలు అఖండ మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని.. చంద్రన్న నాయకత్వంలో గిరిజన వైభవం మరలా రానున్నదని వారికి ధైర్యం చెప్పారు. తెలుగుదేశం విడుదల చేసిన సూపర్ సిక్స్ మ్యానిఫెస్టో పథకాలను ఇంటి ఇంటికి తీసుకెళ్లాలని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో బొబ్బిలి, శృంగవరపుకోట, పాలకొండ, పెందుర్తి, విశాఖపట్నం రూరల్ తదితర గిరిజన నియోజకవర్గాలను నరహర ప్రసాద్ సందర్శించారు.

ఈ సందర్భంగా నరహరి ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వంలో సైకో జగన్ రెడ్డి అరాచక పాలన మితిమీరి పోయింది. రాష్ట్రంలో దాదాపు ఐదేళ్ల క్రితం ప్రజా వేదికతో మొదలైన విధ్వంసం రాష్ట్ర అభివృద్ధిని ప్రశ్నార్థకం చేసింది. కేంద్రం అత్యంత వెనుకబడిన జిల్లాల జాబితాలోకి ఉత్తరాంధ్ర జిల్లాలను చేర్చింది. ఇది తెలిసి కూడా సిగ్గులేని వైసీపీ ప్రభుత్వం ఉపశమన చర్యలు తీసుకోలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపించే కార్యక్రమాలను పక్కనపెట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కే కార్యక్రమంలో జగన్ రెడ్డి నిమగ్నమయ్యారని నరహరి వరప్రసాద్ మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర జిల్లాలలో 10 లక్షల గిరిజన ఓటు బ్యాంకు ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రతో అమాయక గిరిజనుల నమ్మించి నయ వంచన చేశారని ఎద్దేవా చేశారు. రాబోవు ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఓటమిని రిటర్న్ గిప్టుగా ఇవ్వాలని 10 లక్షల మంది గిరిజనులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. జగన్ రెడ్డి గిరిజనులను ఆట బొమ్మలుగా చేసి అధికార మదంతో అరాచకాలను సృష్టిస్తూ రాష్ట్ర గిరిజనాభివృద్ధిని అంధకారంలోకి నెట్టివేశాడని దుయ్యబడ్డారు. ఫ్యాను గట్టిగా తిరిగితే సబ్సిడీ కరెంట్ కట్. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికి అమ్మఒడి కట్. సొంత ఇల్లు ఉంటే రేషన్ కార్డు కట్.. ఇలా పైకి బటన్ నొక్కుతూ లోపల కట్ బటన్ లను నొక్కే దుర్మార్గ పాలన జగన్ రెడ్డిది అంటూ నరహరి ప్రసాద్ హేళన చేశారు.

రాబోవు ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపి బుద్ధి చెప్పడానికి ఉత్తరాంధ్ర జిల్లాలలోని 10 లక్షల మంది గిరిజనులు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, రాష్ట్ర టీడీపీ ఎస్టీ విభాగం ప్రధానకార్యదర్శి పాలవలస గౌరు, అరకు పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి మాలయ్య, లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ పాలవలస పార్వతమ్మ, ఎంపీపీలు, జెడ్పీ.టీ.సీ లు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply