Suryaa.co.in

Andhra Pradesh

గుడివాడలో నిర్వహించిన క్యాసినోపై రేపు టీడీపీ నిజనిర్థారణ కమిటీ పర్యటన

కింజరాపు అచ్చెన్నాయుడు

జూదాలతో రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో యువతను పెడదోవ పట్టించేలా నీచమైన సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారు. దీనిపై మరింత వాస్తవాలను బయటపెట్టేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలోని సభ్యులు రేపు(శుక్రవారం) గుడివాడలో పర్యటించి పూర్తి స్థాయిలో నివేదికను సేకరిస్తారు. తుది నివేదికను కమిటీ సభ్యుల బృందం పార్టీ అధిష్టానానికి అందిస్తుంది. ఈ కమిటీని మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ సమన్వయం చేసుకుంటారు.
నిజనిర్థారణ కమిటీలోని సభ్యులు
1. నక్కా ఆనందబాబు .
2. వర్ల రామయ్య .
3. కొల్లు రవీంద్ర .
4. బోండా ఉమామహేశ్వరరావు .
5. ఆలపాటి రాజా .
6.తంగిరాల సౌమ్య .

LEAVE A RESPONSE