– ఫ్రీ బస్సు ఎక్కి రోజు షాపింగ్ లు చేస్తున్నారు
– ఎమ్మెల్సీ లో మేము గెలిచాం. అప్పుడు కూడా బీఆర్ఎస్ మాకు సపోర్ట్ చేసిందా?
– అజారుద్దీన్ ఓడిపోయినప్పుడు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు?
– వచ్చే ఎన్నికల్లో బీసీ సీఎం, పీఎం అని డిక్లేర్ చేసే దమ్ము కాంగ్రెస్ ఉందా!?
– సర్వే చేసినవాళ్లు బెడ్ రూమ్ లో చేశారా? బాత్ రూంలో చేశారా?
– జాగృతి కుటుంబ సమస్య
– తెలంగాణ సమస్య కాదు..డాడీ -డాటర్ సమస్య
– చిరంజీవి మోడీ అభిమాని
– మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో కింగ్ అవుతున్నాం. అవతలి వాళ్ళు విమర్శిస్తారు కానీ మెచ్చుకుంటారా? టీడీపీ లో ఉన్న కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్ధికి సానుభూతి చూపిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో త్రిముఖ పోటీ ఉంది. సర్వే చేసినవాళ్లు.. బెడ్ రూమ్ లో చేశారా? బాత్ రూంలో చేశారా? అందరూ గెలుస్తాం అనే చెప్తాం.
రాజకీయ పార్టీ లు విమర్శలు చేసేటప్పుడు పరిమితి ఉండాలి. జూబ్లీహిల్స్ కి పాకిస్తాన్ కి లింక్ పెట్టడం సరికాదు. ఇచ్చిందే రెండు.. ఫ్రీ బస్.. సన్న బియ్యం. సన్న బియ్యం కేంద్రం వాటా ఎక్కువ. ఫ్రీ బస్సు ఎక్కి రోజు షాపింగ్ లు చేస్తున్నారు. బజార్ లో ఎవరు నమ్మే పరిస్థితి లేదని, చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళ లాగా చూస్తున్నారని స్వయంగా సీఎం చెబుతున్నారు. ఎమ్మెల్సీ లో మేము గెలిచాం. అప్పుడు కూడా బీఆర్ఎస్ మాకు సపోర్ట్ చేసిందా? దేశంలో ఉన్న 7 బై ఎలక్షన్ కోసం ఒకేసారి అభ్యర్థిని ప్రకటించాం.
మేము ముస్లిం ల మీద ప్రేమతో మంత్రి పదవి ఇవ్వలేదు. నేను ఎవ్వరికి హామీలు ఇవ్వలేదు..మోడీ మీద నమ్మకం తో ఓటేసి గెలిపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నాం. ఎల్ అండ్ టి అగ్రిమెంట్ చేసుకున్నాక ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వాలి. బీజేపీ కేంద్ర బిందువు.. బీజేపీ కాంగ్రెస్ ఒకటని బీఆర్ఎస్ అంటే.. బీఆర్ఎస్ -బిజెపి ఒకటని కాంగ్రెస్ అంటుంది.
విజిలెన్స్ తో విద్యా సంస్థల మీద దాడులు సరికాదు. ప్రభుత్వం మొండి వైఖరి విడి.. ఇస్తా అన్న ఇంస్టాల్మెంట్ క్లియర్ చేయాలి. విద్యార్థులు నష్టపోకుండా చూడాలి. కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాల కాలంలో ఏనాడైనా యాజమాన్యాలను పిలిచి మాట్లాడారా? సౌకర్యాలు లేనప్పుడు కాలేజీలకు పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు?
2023 లో అఫిడవిట్ చూస్తే అజారుద్దీన్ పై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుస్తుంది. అనేక రకాల ఆరోపణలు పత్రికల్లో వచ్చాయి. ఓడిపోయినప్పుడు ఎందుకు మంత్రి పదవి లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్… అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఉంది. ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఉంది. అన్ని రకాలుగా ఓట్లు డివైడ్ అవుతున్నాయి. అధికారంలో ఉన్న వాళ్లు గెలిస్తే, సీఎం గల్లి గల్లి తిరగాల్సిన పని లేదు. వాళ్ళ దగ్గర చెప్పడానికి ఏంలేదు కాబట్టే ఫ్రీ బస్ ఒక్కటే చెప్తున్నారు. సన్న బియ్యంకి 42 రూపాయలు కేంద్రం ఇస్తుంది
వచ్చే ఎన్నికల్లో బీసీ సీఎం, పీఎం అని డిక్లేర్ చేసే దమ్ము కాంగ్రెస్ ఉందా? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీ సీఎం,పీఎం కాంగ్రెస్ చేయలేదు. బీసీలు రాజకీయంగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ఇన్నేళ్లు పాలించి ఎందుకు చట్టసవరణ చేయలేదు? బీసీ రిజర్వేషన్ విషయంలో కోర్టులో సరైన వాదనలు కాంగ్రెస్ వినిపించలేదు.
హైదరాబాద్ లో 20శాతం ఇండ్లకు కూడా వెళ్లి కుల గణన సర్వే చేయలేదు. ఏ బీసీ వర్గానికి ఎంత శాతం పోటీ చేయొచ్చన్నది చెప్పలేదు. 42 శాతం బీసీ రిజర్వేషన్ లో మొత్తం వెళ్ళే పోటీ చేయొచ్చు. అది కాదు కదా? ఢిల్లీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అందరినీ ఏకం చేయడంలో విఫలం అయ్యారని.. కేజ్రీవాల్, కేసీఆర్ కేటీఆర్ సోషల్ మీడియాలో చెప్పారు. ఇవాళ కాకపోయినా రేపై నా కాంగ్రెస్- బీఆర్ఎస్ ఒకటి అవుతారు.
జాగృతి కుటుంబ సమస్య. తెలంగాణ సమస్య కాదు. డాడీ డాటర్ సమస్య. కవిత ఎవరిని తిట్టాలనుకుని, ఎవరిని తిడుతుంది తెలియట్లే. కాంగ్రెస్ తో గెలిచినవాళ్లకు రాజీనామా చేయకుండా మంత్రిని చేసింది బీఆర్ఎస్. రెండు పార్టీలు తోడు దొంగలు. రెండు పార్టీలు ఫిరాయింపు చట్టానికి తూట్లు పొడిచారు.
చట్టం తన పని తానూ చేయాలన్నదాంట్లో ముందు ఉంటాం. బీజేపీ లోకి ఎవరు వచ్చి నా రాజీనామా చేసి రావాలి.
నువ్వు కొట్టినట్టు చేయి. నేను ఏడ్చినట్లు చేస్తా అనేలా రెండు పార్టీల వ్యవహారం ఉంటది. సీఎం మీటింగ్ పెట్టినంత మాత్రాన సినీ కార్మికులు కాంగ్రెస్ కి ఓటేస్తారా? వాళ్ళు సమ్మె నోటీస్ ఇస్తే సీఎం బెదిరించారు. ఎవరి స్వేచ్ఛ వాళ్లకు ఉన్నప్పుడు ఎవరు ఎవరికైన ఓటేస్తారు. చిరంజీవి మోడీ అభిమాని. బీహార్ లో 100 శాతం గెలుస్తాం .. ప్రభుత్వం ఏర్పడుతుంది
తెలంగాణ లో బీజేపీ బలపడొద్దని మజ్లిస్ లక్ష్యం. 7 అసెంబ్లీ, ఒక్క పార్లమెంట్ తప్ప ఎక్కడా పోటీచేయరు. సికింద్రాబాద్ లో 8 లక్షల మంది ఉన్నారు. పోటీ చేయరు. ఎవరు గెలిచిన సూట్ కేస్ లు ఇస్తే తీసుకుని దారుసలాం పోతారు.