– రేవంత్, కేసీఆర్ జూబ్లీహిల్స్ బస్తీలో తిరగాలి
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్ కాలనీలో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: నాగార్జున కమ్యూనిటీ హాల్ వద్ద ప్రారంభమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ.. ఎల్లారెడ్డి గూడ, న్యూ సైన్స్ కాలనీ, ఆర్బీఐ క్వార్టర్స్, యూసఫ్ గూడ బస్తీ, గణపతి కాంప్లెక్స్, ఐఎన్ కమ్యూనిటీ లైన్, వెంకటగిరి గణేష్ టెంపుల్ మీదుగా పూర్ణ టిఫిన్ సెంటర్ వద్ద ముగిసింది.
ఈనెల 11వ తేదీన జరగబోయే ఎన్నికల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ, మన అభ్యర్థి దీపక్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాల. గడచిన కాలంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ఇందుకు నిదర్శనంగా, జూబ్లీహిల్స్‌లో ఎక్కడ చూసినా పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, వెలగని వీధిలైట్లు, శుభ్రత లేని తాగునీరు కనిపిస్తున్నాయి.
దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని అన్యాయం చేసిన ఈ రెండు పార్టీలను మనం తప్పక నిలదీయాలి. కేసీఆర్ జూబ్లీహిల్స్ కి గల్లీలో పర్యటించాలి. అప్పుడే తను చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీజేపీ ఈ నియోజకవర్గంలో గెలవకపోయినా, ఈసారి మార్పు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది.
గతంలో కేసీఆర్ అనేక హామీలతో ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అదే బాటలో పయనిస్తోంది. మహిళలకు రూ. 2,500, తులం బంగారం, నిరుద్యోగులకు రూ. 4,000 భృతి, 4 లక్షల ఉద్యోగాలు, దివ్యాంగులకు రూ. 6,000 పెన్షన్, పెళ్ళికి రూ. లక్ష వంటి ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఈ హామీల్లో ఒక్కటైనా నెరవేరిందా? గత ముఖ్యమంత్రి మాదిరిగానే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాటలతో కోటలు కడుతూ ప్రజలను మోసం చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఈ మూడు పార్టీలు నిజానికి ఒక్కటే. ఇవన్నీ కేవలం కుటుంబ పార్టీలే. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే ఈ పార్టీల కబంధ హస్తాల నుంచి హైదరాబాద్‌ను, ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ను మనం రక్షించుకోవాలి. వందలాదిమంది హిందువుల ఇళ్ల పైన మజ్లిస్ పార్టీ దాడి చేసింది. మన ఓటుతో ఈ మూడు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఇది. అభివృద్ధిని కాంక్షించే, ప్రశ్నించే బీజేపీ పార్టీని గెలిపించి, జూబ్లీహిల్స్ అభివృద్ధికి బాటలు వేయాల్సిందిగా కోరుతున్నాను