Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ గెలుపుతోనే బీసీల గెలుపు

– ఇలాంటి బీసీ ద్రోహి జగన్ రెడ్డిని తరిమేస్తేనే బీసీలకు మేలు
– చదువుతోనే బీసీల సామాజిక అభివృధి సాధ్యమని టీడీపీ గుర్తించింది
– టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు

బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి రారాజులను చేసింది తెలుగుదేశం పార్టీ, నందమూరి తారకరామారావే. జగన్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలుగుదేశం నుండి బీసీలను దూరం చేయలేరని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి అధ్యక్షతన విశ్వబ్రాహ్మణ, నగరాలు, చాత్తాడ శ్రీవైష్ణవ, శిష్టకరణాలు సాధికార సమితుల శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే బీసీలకు రాజకీయంగా సామాజికంగా గౌరవం లభించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోజే నాటిన మొక్క అనే నేను. అతి చిన్న వయసులోనే నన్ను ఎమ్మెల్యేని చేసి ఈరోజు ఈ స్థాయిలో నిలిపిన ఘనత నాడు బీసీలకు అండగా ఉండాలని ఎన్టీఆర్ తీసుకున్న చొరవే. బీసీలు బాగుపడాలన్న అభివృద్ధి చెందాలన్నా చదువుతూనే సాధ్యమని విద్యలో బీసీలకు ప్రోత్సాహం అందించారు.

ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి బీసీలు చదువుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ తాపత్రయపడింది. అండగా నిలిచింది. అలాంటి పరిస్థితుల నుండి నేడు ఏ రోజు ఎక్కడ ఎవరి మీద దాడి జరుగుతుందో తెలియని పరిస్థితిని జగన్ రెడ్డి సృష్టించారు. మన నిధులు కాజేస్తున్నాడు. ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశాడు. రాజకీయ అవకాశాలు దూరం చేశాడు. ఇలాంటి బీసీ ద్రోహి జగన్ రెడ్డిని తరిమేస్తేనే బీసీలకు మేలు జరుగుతుందని చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

రవీంద్ర మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ముందుకెళ్లిన రోజు అన్ని రకాలుగా ముందంజలో నిలుస్తాము. ప్రస్తుతం బీసీల్లో ఉన్న చీలికలు మనల్ని మరింతగా వెనక్కి నెడుతున్నాయి. ఆ చీలికలని జగన్ రెడ్డి అవకాశంగా తీసుకొని మరింతగా చీల్చి రాజకీయంగా వాడుకుంటున్నాడు. పారిశ్రామిక రాయితీలు రద్దు ద్వారా బీసీల్లోని అనేక వర్గాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితులు మారాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అప్పుడే విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు మెరుగైన స్థాయి దక్కుతుంది.

శాసన మండలి సభ్యులు ద్వార రామారావు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఎల్లప్పుడూ బీసీలను అభివృద్ధి చేయడంపైనే దృష్టిపెట్టారాని, సంచార జాతర అన్నింటిని ఏకం చేస్తూ ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి ఒక తాటిపైకి తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు.
ఈ సందర్భంగా నాలుగు సాధికార కమిటీలకు రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్లను కొల్లు రవీందర్ నియమించారు.

కార్యక్రమంలో సాధికార సమితుల కోఆర్డినేటర్, రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి కనకాచారి, విశ్వబ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ నరసింహచార్యులు, నగరాల సాధికార సమితి కన్వీనర్ మరుపిల్ల తిరుమలేష్, శిష్టకరణాల సాధికార సమితి కన్వీనర్ హక్కు మహంతి రాజా, చేత్తాడ శ్రీ వైష్ణవ సాధికార సమితి కన్వీనర్ వసుంధర, బీసీ ఫెడరేషన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గంజం రాఘవేంద్ర, విశాఖపట్నం పార్లమెంట్ బీసీ అధ్యక్షులు తమ్మిన విజయకుమార్, ఎన్టీఆర్ జిల్లా బీసీ బీసీ అధ్యక్షులు మల్లికార్జున కాకు మల్లికార్జున యాదవ్ సహా పలువురు బిసి సెల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE