కాకినాడ: గురుపూజ దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులైన పెంకె వెంకటరమణ, ఎన్ వీర రాఘవరావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీసానా సతీష్ బాబు మరియు వారి సహచరులు, అభిమానులు, కార్యాలయ సిబ్బంది ప్రజా సమస్యలపై గొప్పగా స్పందిస్తున్నారు అని, వీరందరి మధ్య ఈ సత్కారాన్ని పొందడం తమకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయం ఇన్చార్జ్ మేకా లక్ష్మణమూర్తి, మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు (బున్నీ),నులుకుర్తి వెంకటేశ్వరరావు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, చింతపల్లి అర్జున్, ఆనంద్ న్యూటన్,పి.ఎ.గౌరీ శంకర్ డి.ఆర్.యు.సి.సి సభ్యుడు అనిల్,బండి నరేంద్ర, జిన్నూరు బాబ్జి పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.