తెలంగాణ ఉద్యమకారులారా…. ఇంకెన్నాళ్లీ మౌనం?

3

-బీజేపీ అధికారంలోకి రాగానే…..
   1)2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
   2)ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం
   3)డీఎస్సీ-2008 బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం
– తెలంగాణ ఉద్యమకారులారా…. ఇంకెన్నాళ్లీ మౌనం?
– 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల నాశనమవుతున్నా స్పందించరా?
– మీకు అండగా మేమున్నాం…. కేసీఆర్ పాలనను బొందపెట్టేదాకా ఉద్యమిద్దాం రండి…
– నిరుద్యోగుల పక్షాన ఆందోళనలను ఉధ్రుతం చేస్తాం
– ఏప్రిల్ 2 నుండి 6 వరకు జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం
– ఆ తరువాత రాష్ట్ర రాజధానిలో భారీ ఎత్తున నిరుద్యోగ మిలియన్ మార్చ్
– అవసరమైతే సర్కార్ కు సెగ తగిలేందుకు రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తాం
– జైళ్ల శాఖ డీజీ ఖబడ్దార్… బీజేవైఎం నేతలను జైళ్లలో వేధిస్తారా?
– అధికారంలోకి వచ్చాక మీకు చిప్పకూడు తిన్పిస్తాం
– కేసీఆర్ ఫ్రభుత్వంపై ఆశ పెట్టుకోవద్దు… ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదు
– బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే
– నిరుద్యోగులకంటే రాహుల్ గాంధీ ప్రయోజనాలే ఆ పార్టీలకు ఎక్కువయ్యాయి
– లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా పోరాడదాం
– కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా ఉద్యమిస్తాం
– నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారమిచ్చేదాకా ఊరుకోం
– నిరుద్యోగ మహాధర్నా ముగింపులో బండి సంజయ్ కుమార్ ఫైర్…
– నిరుద్యోగ మహాధర్నా బ్లాక్ బస్టర్….
– భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, బీజేపీ కార్యకర్తలు
– బండి సంజయ్ కు సంఘీభావం తెలిపిన అన్ని వర్శిటీల విద్యార్థి జేఏసీ సంఘాలు
– సంజయ్ సమరానికి తాము సైతం సై అంటు నినదించిన డీఎస్సీ-2008 బాధితులు

‘‘కేసీఆర్ పాలనలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైంది. ఇగ ఉద్యోగాలొస్తాయనే ఆశ పెట్టుకోవద్దు… మేమున్నాం…మీరేం భయపడకండి. బీజేపీ అధికారంలోకి రాగానే….. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. యూపీఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం. డీఎస్సీ-2008 బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. బీజేపీ ఈరోజు ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నా ముగింపు సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి ‘‘తెలంగాణ ఉద్యమకారులారా…. ఇంకెన్నాళ్లీ మౌనం? ఏమైంది ఆనాటి ఉద్యమ స్పూర్తి? కేసీఆర్ కేసులు పెడతారని భయపడుతున్నారా? 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల నాశనమవుతున్నా స్పందించరా?. రండి మీకు అండగా మేమున్నాం. మీకు బాధవస్తే మా భుజాన వేసుకుంటాం… నిరుద్యోగుల తరపున రొడ్డెక్కి కొట్లాడదాం.. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దాం రండి’’అంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు……

• బీజేపీ నిరుద్యోగ మహాధర్నాకు విచ్చేసిన నిరుద్యోగులకు, విద్యార్థి జేఏసీ నాయకులకు, డీఎస్సీ-2008 బాధితులకు, పార్టీ కార్యకర్తలకు అభినందనలు.
• 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన బీజేవైఎం నాయకులను జైళ్లో వేశారు. అక్కడ ఇష్టానుసారం వేధిస్తున్నారు.. జైళ్ల డీజీ ఖబడ్దార్….వచ్చేది మా ప్రభుత్వమే.. నీకు చిప్పకూడు తిన్పిస్తాం…
• సిగ్గుండాలే… ప్రభుత్వ ఉద్యోగిగా జీతం తీసుకుంటూ… ధర్మం కోసం, నిరుద్యోగుల పక్షాన జైలుకొచ్చిన వాళ్లను వేధిస్తారా? బూతులు తిట్టిస్తారా? రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని బెదిరిస్తారా? ఇది న్యాయమేనా అని మీ కుటుంబ సభ్యులను అడగండి…
• ఉస్మానియా వర్శిటీ వెళ్లి చూస్తే ఎంత దారుణ పరిస్థితులున్నాయో తెలుసుకోండి.. 30 లక్షల మంది నిరుద్యోగులు చస్తుంటే కనీసం పట్టించుకోని కేసీఆర్…. రాహుల్ గాంధీ కోసం బ్లాక్ డే అంటావా?
• బీఆర్ఎస్ నిద్ర మత్తులో ఉంది… ఇక ఆ పార్టీ లేవదు…
• ఉస్మానియా విద్యార్థులారా…. తెలంగాణ తరహాలో మరో పోరాటానికి సిద్ధం కండి… మేం మీ వద్దకు వస్తాం… పోలీసు వలయాలను చేధించుకుని మీ తరపున పోరాడతాం…
• సబ్బండ వర్గాలు చేసిన తెలంగాణలో రాళ్లు మోసినోళ్లు దొంగలయ్యారు… రాళ్లు విసిరినోళ్లు రాజులాయే…

• పాస్ పోర్ట్ బ్రోకర్ పాలనలో ఒకరు లిక్కర్ క్వీన్… ఇంకోకరు లీకేజీ కింగ్…
• నిరుద్యోగులు డబ్బుల్లేక మధ్యాహ్నం లంచ్ చేయరు… అన్నీ కలిపి సాయంత్రం 4 గంటలకు భోజనం చేస్తున్నారు. వయసు మీదపడ్డా ఉద్యోగాలు రాక గడ్డాలు పెంచుకుంటూ చదువుకుంటున్నారు. కుటుంబాలకు భారమైనరు.
• కేసీఆర్ ఫ్రభుత్వంపై ఆశ పెట్టుకోవద్దు… ఉద్యోగాలివ్వదు… నిరుద్యోగులను మోసం చేసేందుకు నోటిఫికేషన్లు ఇస్తారు.. లీకేజీలతో జాప్యం చేస్తూనే ఉంటారు.
• ప్రశ్నించిన మాకు నోటీసులిస్తున్నారు. మరి కేటీఆర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు? ఇద్దరికే లీకేజీ సంబంధం ఉందని చెబితే.. ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారు… ఏ హోదాతో కేసీఆర్ కొడుకు చెప్పారో నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదు? సిట్ కు ఆ ధైర్యం లేదా?
• అనేక కేసుల్లో వేసిన సిట్ నివేదికలేమయ్యాయి. నయీం డైరీ ఆస్తులెటు పోయినయ్… ఆయన భూములను ఆక్రమించుకున్నదెవరు? డ్రగ్స్, మియాపూర్ భూముల కేసులేమైనయ్… ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య కేసు ఏమైంది?
• లీకేజీకి సహకరించిన వారిపై విచారణ జరపాలి. కేసీఆర్ కొడుకు పాత్ర ఉంది. ఆయనకూ నోటీసులివ్వాల్సిందే…
• లీకేజీకి ఇద్దరు, ముగ్గురికే పరిమితం కాలేదు.. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను ఎందుకు తొలగించడం లేదు? తొలగిస్తే వాళ్లు బయటకొచ్చి వాస్తవాలు బయటపెడతారనే భయంతోనే వారిపై చర్యల్లేవు.

• 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేసిన లీకేజీపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు? తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి భయమెందుకు?
• ఆస్తులమ్ముకుని, అప్పు చేసి, తాళిబొట్టు కుదవపెట్టుకుని కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులు లీకేజీతో నష్టపోయారు. వాళ్లకు రూ.లక్ష పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు?
• ఏ శాఖలో తప్పులు జరిగినా కేసీఆర్ కొడుకే స్పందిస్తున్నాడు? ఆయన షాడో సీఎం. లీకేజీ అయితే మాత్రం నాకే సంబంధం లేదంటున్నడు… తప్పు చేయకపోయినా మంత్రులను బయటకు పంపిన కేసీఆర్ కొడుకు తప్పు చేస్తే ఎందకు బర్తరఫ్ చేయడు?
• దొంగ సారా దందా చేసి దొరికన బిడ్డను, లీకు వీరుడు కొడుకును కాపాడుకునేందుకు యత్నిస్తున్న కేసీఆర్ నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోవడం లేదు? సీఎం నిర్వాకంవల్ల నిరుద్యోగులు బతుకులు బర్బాద్ అయ్యాయి.
• నిరుద్యోగులారా మీరేం భయపడకండి. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే… రాగానే డీఎస్సీ-2008 బాధితుల సమస్యను పరిష్కరిస్తాం…
• 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డెక్కి కాషాయ జెండా పట్టుకుని గండ్రించే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ను తరిమికొట్టి గొల్ల కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేస్తాం.
• బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం… యూపీఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం.
• కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లన్నీ తప్పిదాల్లేకుండా సక్రమంగా నిర్వహిస్తోంది. మరి కేసీఆర్ కు ఎందుకు చేతకావడం లేదు?
• పరీక్షల్లో స్కాం… లిక్కర్ లో స్కాం… ధరణిలో స్కాం… ఇరిగేషన్ టెండర్లలో స్కాంలే… కేసీఆర్ పాలన అంతా స్కాముల మయమే.

• నిరుద్యోగులారా…దేనికోసం తెలంగాణ సాధించుకున్నం? ఉద్యమకారులంతా యాడ పోయారు? ఇంకెన్నాళ్లు భరిస్తారు? ఉద్యోగుల, నిరుద్యోగుల, రైతుల భవిష్యత్ నాశనమైతుంటే ఇంకా చూస్తూ ఊరుకుంటారా? దేనికోసం భయపడుతున్నారు? వందేళ్లు బతకాలనే ఆశతోనా?
• ఉస్మానియా వర్శిటీలో జై తెలంగాణ నినాదంతో చేసిన ఉద్యమాలను, కాకతీయ వర్శిటీలో జరిగిన లాఠీ ఛార్జ్ లను గుర్తు చేసుకోండి… దొంగ దీక్షలతో మోసం చేసిన కేసీఆర్ అసలు స్వరూపాన్ని గుర్తు చేసుకోండి…
• 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల కంటే మించిన దేముంది? అందుకే బీజేపీ పోరాడుతోంది. కేసీఆర్ కొడుకు రాజీనామా చేసేంత వరకు పోరాడదాం… సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే వరకు, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా పోరాడదాం…
• సీహెచ్ విఠల్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ అన్ని జిల్లాల్లో తిరుగుతుంది. వచ్చే నెల 2 నుండి 6 వరకు అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. ఆ తరువాత రాజధాని నడిబొడ్డున నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం… అవసరమైతే సర్కార్ కు సెగ తగిలేందుకు రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తాం.
• బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ దొందు దొందే. రాజకీయాల కోసం స్వార్ధ బుద్దితో ఈ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి. వాళ్లకు బుద్ది చెప్పండి…
• నిరుద్యోగుల కోసం పోరాడుతున్న బీజేపీని ఆదరించండి. మీకోసం బీజేపీ నాయకులను, కార్యకర్తలను, మహిళా నేతలను జైలుకు పంపుతున్నారు. కేసులు పెడుతున్నారు. బెదిరిస్తున్నారు. అయినా భయపడేది లేదు.
• కేసీఆర్ కొడుకు రాజీనామా చేసేదాకా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే వరకు, నిరుద్యోగులకు రూ. లక్ష పరిహారం ఇచ్చేదాకా పోరాడతాం…
• తెలంగాణ ఉద్యమకారులారా… ప్రజలారా… కేసీఆర్ సర్కార్ ను తెలంగాణ పొలిమేరల్లో తరిమి తరిమికొట్టేందుకు బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలని కోరుతున్నా… మీకు ఏ బాధ వచ్చినా బీజేపీ భుజస్కందాలపై వేసుకుని కొట్లాడతాం…