Suryaa.co.in

Telangana

19న తెలంగాణ బడ్జెట్.. 27 వరకు అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది.. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. 19న ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 26 వరకు వివిధ పద్దులపై సభలో చర్చ చేపట్టనున్నారు..

ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగించారు. అనంతరం శాసన సభ రేపటికి వాయిదా పడింది. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.

శాసన సభ భవనం లోని స్పీకర్ చాంబర్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈ నెల 19న రాష్ట్ర బడ్జెట్‌ని ప్రవేశ పెట్టేందుకు తీర్మానించారు. గురువారం (13న) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనున్నది. 14న హోలీ పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ఉంటుంది. 15 గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. 16న ఆదివారం సెలవు ఉంటుంది.

17, 18 ప్రభుత్వ బిజినెస్‌ ఉంటుందని.. రిజర్వేషన్ల బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. 19న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెడుతారు. 20న సెలవు, 21న బడ్జెట్‌పై సాధారణ చర్చ ఉంటుంది. 22, 24, 25, 26 పద్దులపై, 27 ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగనున్నది.

LEAVE A RESPONSE