Suryaa.co.in

Telangana

రైతుల సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం భేష్

– సుప్రీం కోర్టు వేసిన హై పవర్ కమిటీ అభినందన
– హై పవర్ కమిటీ తో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, విత్తన చట్టం కమిటీ సభ్యులు భేటీ

పంచకుల: పంజాబ్ రైతుల విషయంలో సుప్రీం కోర్టు గతంలో వేసిన హై పవర్ కమిటీ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని, రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడ్తుందని కొనియాడింది. ఈరోజు హర్యానా రాష్ట్రంలోని పంచకుల నగరంలో ప్రభుత్వ వ్యవసాయ కార్యాలయం లో హై పవర్ కమిటీ తో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, విత్తన చట్టం కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో హై పవర్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సమస్యలు, ప్రభుత్వ పథకాలు, ప్రధాన పంటలపై సుదీర్ఘంగా చర్చించారు. ఐతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్, రాయితీ లపై వ్యవసాయ పనిమొట్లు లాంటి పథకాలపై హై పవర్ కమిటీ కి తెలంగాణ బృందం వివరించింది. దానికి హై పవర్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు.

ఇతర రాష్ట్రాల్లో రైతుల సమస్యలు, అక్కడి పాలసీలకంటే తెలంగాణలో బాగా ఉన్నాయని హై పవర్ కమిటీ అభిప్రాయపడింది. అదేవిదంగా ములుగు విత్తనోత్పత్తి ఘటనపై కూడా హై పవర్ కమిటీ ఆరా తీసింది. ములుగు లో జరిగిన ఇష్యూ ను మల్టీనేషనల్ విత్తన కంపెనీల మోసాలపై హై పవర్ కమిటీ దృష్టికి తెచ్చారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. సమగ్ర మైన విత్తన చట్టం తోనే విత్తన కంపెనీలను కట్టడి చెయ్యొచ్చని, విత్తనోత్పత్తి చేసే రైతులకు న్యాయం జరుగుతుందని వివరించారు.

ఐతే విత్తన చట్టం తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై కూడా హై పవర్ కమిటీ కివివరించారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమని విత్తన చట్టం రాష్ట్ర పరిధి లోకే వస్తుందని, కేంద్రం అడ్డుకునే విధానం సరికాదన్నారు. తెలంగాణ బృందం చేసిన విలువైన సూచనలను హై పవర్ కమిటీ నోట్ చేస్తుకుందని, మరిన్ని సలహాలు సూచనలు ఉంటే.. సీల్డ్ కవర్లో రాసి పంపాలని హై పవర్ కమిటీ చెప్పినట్లు కోదండరెడ్డి తెలిపారు. హై పవర్ కమిటీ ఆహ్వానం మేరకే హర్యానాకు వచ్చినట్లు ఆయన వివరించారు.

ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ హర్యానా రాష్ట్రంలోని పంచకుల జిల్లా రాయపూర్ రాణి మండలం హరిపూర్ గ్రామంలో పర్యటించారు. అక్కడి రైతులతో సమావేశమయ్యారు. హర్యానాలో వ్యవసాయ పరిస్థితులు, రైతుల ఇబ్బందులు, విత్తన చట్టం అమలు తీరు, రైతాంగం కోసం హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన పథకాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను వివరించారు.

హై పవర్ కమిటీ సమావేశంలో హాజరైన వారు వీరే..

హై పవర్ కమిటీ చైర్మన్ జస్టిస్ నవాబ్ సింగ్, కమిటీ సభ్యులు దేవేందర్ శర్మ, డా. సూక్పాల్ సింగ్, ప్రొఫెసర్ R. S. గుమన్, B. S. సందు హై పవర్ మెంబర్ సెక్రెటరీ డా. అమిత్ అగర్వాల్ ఉంటే… ఇక తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ M. కోదండ రెడ్డి, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రైతు కమిషన్ సలహాదారులు రామాంజనేయులు, డా. దొంతి నర్సింహ రెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు శివ ప్రసాద్, హరి వేంకట ప్రసాద్, హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE