– 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణలో సోమవారం నాడు కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీఓను విడుదల చేసింది. మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించారు.
విద్య, ఉద్యోగాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్-1గా, మధ్యస్తంగా లబ్ధిపొందిన కులాలను గ్రూప్-2గా, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్-3లో చేర్చినట్లు ఎస్సీ వర్గీకరణ జీవోలో పేర్కొన్నారు.
గ్రూప్ ఏలో ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్, గ్రూప్ బీ లో ఉన్న వారికి 9 శాతం, గ్రూప్ సీలో ఉన్న వారికి 5 శాతంగా రిజర్వేషన్ అమలు చేయనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఎస్సీ వర్గీకరణ జీవోను తెలంగాణ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.