రైతు బంధు, రైతు భీమా, ఉచిత కరెంటు భేష్

– దేశమంతా తెలంగాణ పథకాలు అమలు కావాలన్నదే మా అభిలాష
– తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
– కల్వకుంట్ల కవితతో కర్ణాటక, తమిళనాడు, కేరళ రైతు నేతల భేటి

హైదరాబాద్ : తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకలు అద్భుతంగా ఉన్నాయని , అవి దేశమంతా అమలు కావాలన్నదే తమ అభిమతమని కర్ణాటక, కేరళ, తమిళనాడు రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు. ఆ మూడు రాష్ట్రాల రైతు సంఘాల నేతలు హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అనడానికి నిదర్శనమని ఈ సందర్భంగా వారు తేల్చిచెప్పారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందిచడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులు అత్యంత సంతోషంగా ఉన్నారని,ఇతర రాష్ట్రాల రైతులు కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారని తెలియజేశారు. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, చేపడుతున్న పనులు దేశానికి స్పూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో మార్పులు సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశంలో సమగ్ర మార్పు సాధ్యం అని వారు తెలిపారు.

రైతుల సంక్షమం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న కెసిఆర్ నాయకత్వంలో పని చేయడానికి రైతు నేతలు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు కవితతో చర్చలు జరిపారు. ఆయా రాష్ట్రాల్లోని రైతుల సమస్యలు కవిత దృష్టికి తీసుకొచ్చారు. గీత కార్మికుల సమస్యల పై కూడా చర్చించారు.

Leave a Reply