Suryaa.co.in

Telangana

ప్రపంచ పర్యాటక సాంస్కృతిక యవనికపై తెలంగాణ టూరిజం

-తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ITB, బెర్లిన్ లో జరుగుతున్న వరల్డ్ టూరిజం కల్చర్ & ఎగ్జిబిషన్ లో స్టాల్ ఎర్పాటు 
-తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిన
-ఇంటర్నేషనల్ టూరిజం కల్చర్ ఎగ్జిబిషన్ లో ఆకట్టుకున్న తెలంగాణ బతుకమ్మ
-ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్ లో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న కాకతీయ కళాతోరణం, రామప్ప దేవాలయం
-జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరుగుతున్న ITB, బెర్లిన్ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 180 దేశాలు
-తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు విశ్వవ్యాప్త గుర్తింపు లక్ష్యంగా తెలంగాణ టూరిజం ప్రమోషన్
-తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్ ను ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్

జర్మనీ రాజధాని బెర్లిన్ లోని ITB, బెర్లిన్ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్ లో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టూరిజం అండ్ కల్చర్ స్టాల్ ను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు తెలంగాణ టూరిజం ప్రాంతాల విశిష్టతను అంతర్జాతీయ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శనలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం, కాకతీయుల కళాతోరణం తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరిగింది. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను తెలంగాణ టూరిజం స్టాల్ వద్ద నిర్వహించడం జరిగింది. బెర్లిన్ లోని ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్లో తెలంగాణ టూరిజం స్టాల్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందన్నారు రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

జరుగుతున్న ఇంటర్నేషనల్ టూరిజం కల్చర్ ఎగ్జిబిషన్లో 180 దేశాలకు చెందిన పర్యాటక, సాంస్కృతిక సంస్థలు పాల్గొంటున్నాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటికి సరైన ప్రమోషన్ ను కల్పించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తెలంగాణ పర్యాటక పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు ప్రపంచ స్థాయి వేదికలపై తెలంగాణ టూరిజం ప్రమోషన్ ను నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్రం టూరిజం హబ్ గా ఇప్పటికే పలు టూరిజం సంస్థలు గుర్తించి అవార్డులు అందిస్తున్నాయన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్, జర్మనీలోని భారత రాయబారి పర్వతనేని హరీష్ రావు, ఇండియా టూరిజం సెక్రటరీ అరవింద్ సింగ్, తెలంగాణ టూరిజం ఎండి మనోహర్ జర్మనీలోని తెలంగాణ అసోసియేషన్ జర్మనీ అధ్యక్షులు డాక్టర్ రఘు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE