– డబుల్ ఇంజన్ సర్కారు కోసం ప్రజల ఎదురుచూపులు
– కాంగ్రెస్, బీఆర్ఎస్ను ప్రజలు నిలదీయాలి
– కాంగ్రెస్ హామీలేమయ్యాయని నిలదీయండి
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చాటదాం
– బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు లేదు
– జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడాలోని మహమూద్ గార్డెన్స్ లో జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్: త్వరలో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు రానున్నాయి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీకి పట్టం కట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ తో మార్పు సాధ్యమని చెప్పి.. మోసపూరిత హామీలతో గద్దెనెక్కి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసింది.
నాడు కెసిఆర్ పరిపాలన ఎలా ఉందో ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అలాగే కొనసాగుతుంది ఉంది. అనేక పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పాలనలో నిరాశ నిస్పృహలకు గురయ్యారు. ఓ కుటుంబం చేతిలో బందీ అయ్యామని మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటేస్తే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పాలనతో ప్రజల్ని మోసం చేస్తోంది.
టిఆర్ఎస్ పరిపాలన చూసిన తెలంగాణ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే, టిఆర్ఎస్ పార్టీ లాగానే నేడు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మరింత అప్పులకుప్పగా మార్చిందని ప్రజలు కాంగ్రెస్ పార్టీని అసహ్యించుకుంటున్నారు.
ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మద్దతు కోల్పోయింది. అనేక రకాల హామీలతో పాటు ఇచ్చిన 6 గ్యారంటీని అమలు చేయలేకపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పాటు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రజా క్షేత్రంలో నిలదీయాలి. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రశ్నించాలి.
ప్రతి మహిళకు 2,500 ఇస్తామని హామీ ఇచ్చి తెలంగాణ మహిళల్ని కాంగ్రెస్ మోసం చేసింది. తులం బంగారం ప్రతి విద్యార్ధికి స్కూటీ హామీలు ఎక్కడిపోయాయని ప్రశ్నించాలి. ఎన్నికల ముందు యువతకిచ్చిన హామీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి 4000 ఊసే లేదు. ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని చెప్పి ఓట్లు వేసుకొని దళతులని మోసం చేసింది. అందుకే ఆయా వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యాయి.
బీసీల అభివృద్ధికి ఇదేళ్లలో ఐదు లక్షల కోట్లు కేటాయిస్తామని చెప్పి బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి, బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు లేదు. ఈ రెండేళ్లలో బీసీ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాల్సిన అవసరం ఉంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీ చేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నిరుద్యోగుల్ని యువతను మోసం చేసింది. నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఇప్పటివరకు పెంచలేదు.
పొదుపు సంఘాలకు కేంద్రం ఇరవై లక్షల రుణం ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పొదుపు సంఘాలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, మహిళల్ని పొదుపు సంఘాల మహిళలని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. విద్య భరోసా ఐదు లక్షలు ఏమైందో యువత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. DA, PRC విషయంలో ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేస్తుంది.
కలహాలతో కాంగ్రెస్,బీఆర్ఎస్ బిజీ: రాంచందర్‌రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పని అయిపోయిందని, సీఎం రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికే నమ్మకం లేదన్నారు. తాను ఇక అసెంబ్లీకే రానని కోమటిరెడ్డి చెప్పడంతోనే, పార్టీపై రేవంత్ పట్టు ఏపాటిదో స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు.
అసమ్మతి రాజకీయాలతో కాంగ్రెస్, కుటుంబ రాజకీయాలతో బీఆర్ఎస్ బిజీగా ఉండి ప్రజల సమస్యలను గాలికొదిలేశాయని విరుచుకుపడ్డారు. రానున్న జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీని గెలిపించడం ద్వారా, రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని చాటాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్-బీఆర్ఎస్ను ఓడించడం ద్వారా, బీజేపీ కార్యకర్తలు తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.