Suryaa.co.in

Andhra Pradesh

అమరజీవి త్యాగం తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు

– ఎమ్మెల్యే ఇంటూరి

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రం కోసం చేసిన ప్రాణత్యాగం తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు 58 రోజులు నిరాహార దీక్షను చేసి ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. అమరజీవి మన జిల్లాలో జన్మించి, ఈ భూమిని పావనం చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మురారిశెట్టి సుధీర్ కుమార్, తాతా లక్ష్మీనారాయణ, కోట కిషోర్, మురారిశెట్టి వెంకట సుబ్బారావు, చక్కా వెంకట కేశవరావు, కోట వెంకట నరసింహ, బొగ్గవరపు సత్యనారాయణ, ఇస్కాల మధు, గుర్రం అల్లూరయ్య మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE