Suryaa.co.in

Features

తెలుగు భాష లో మనం “చంపేసిన” తెలుగు పదాలు

01) అన్నము-బువ్వ (మీల్స్)
02) కూర (కర్రీ)
03)కంచం (ప్లేట్)
04) లోటా ( గ్లాస్)
05) పచ్చడి – ( చట్నీ)
06) ఊరగాయ -(పికిల్)
07) నీళ్లు -(వాటర్)
08) సీసా – ( బాటిల్)
09) చెంచా – (స్పూన్)
10) పాలు -( మిల్క్)
11) పెరుగు – (క ర్ఢ్)
12) కోడి కూర- ( చికెన్ క ర్రి)
13) చేప కూర – (ఫిష్ కర్రీ)
14) తుండు గుడ్డ -(టవల్)
15) చొక్కా- అంగి ( షర్ట్)
16)ఉప్పు – (సాల్ట్)
17) ఘాటు – (స్పై సి)
18) చేతి గుడ్డ – ( హాఁ కీ)
19) బల్ల – (టేబిల్)
20) కుర్చీ – (చైర్)
21) మంచం – (కాట్)
22) పొడుగు లాగు- (పాంట్)
23) తీపి – ( స్వీట్)
24) తలుపు -( డోర్)
25) కిటికీ – ( విండో)
26) తాళం – (లాక్)
27) తాళం చెవులు -( కీస్)
28) మీట – ( స్విచ్)
29) పుస్తకం -(బుక్)
30) కాగితం – (పేపర్)
31) కలం – (పెన్)
32) పలక -( slate)
33) సూది -(నీడి ల్)
34) దారం – (థ్రెడ్)
35) స్నానం – ( బాత్)
36) సబ్బు – (సోప్)
37) సంచి – (బాగ్)
38) పొడి – (పౌడర్)
39) బడి – (స్కూల్)
49) పాఠం – (లెసన్)
50) లెక్కలు -(మాథ్స్)
51) ఎక్కాలు- (టేబుల్స్)
52)సాంఘికశాస్త్రం – (సోషల్)
53)సామాన్య శాస్త్రం – ( సైన్స్)
54) చరిత్ర – (హిస్టరీ)
55) అర్థశాస్త్రం – (ఎకనోమిక్స్)
56) బలపం -(పెన్సీల్)
57) రంగు – (కలర్)
58) సమయం – (టైం)
59) దారి – తోవ- (రోడ్)
60) అమ్మ -(మమ్మి)
61) నాన్న -(డాడీ)
62) నెల – (మంత్)
63) పిన్ని-ఆమ్మ- అత్త (ఆంటీ)
64) పెదనాన్న-బాబాయ్
మామ (అంకుల్)
65) నెయ్యి – ఘీ
66) పక్షి – బర్డ్

ఇంకా ఎన్నో…
అన్నీ రకాల రంగుల పేర్లు,అన్ని రకాల కూరగాయల పేర్లు,అన్ని వారాల పేర్లు,అన్ని నెలల పేర్లు..చాలా జాగ్రత్త గా కుటుంబ అంతా కలసి చంపేశాం…
మనకు వీలైతే ఇంగ్లీష్ పదం,తెలియక పొతే హిందీ పదం.
ఇంకా తెలియక పోతే తమిళ పదంఐనా వాడతాం కానీ..ఇంకేమి లేకపోతే అప్పు డు తెలుగు పదాన్ని అతి కష్టం గా వాడతాం…
ఇంత దారుణమైన భాషా హత్య ఏ భాషలో కూడా జరుగ లేదు. ఐక్యరాజ్యసమితి ప్రకారం వాడుకలేమితో అంతరించి పోయేభాషల్లో మన తెలుగుభాష కూడా వుంది.

దయచేసి చనిపోయిన పదాల్ని బ్రతికిద్దాం కనీసం మన తర్వాత తరానికి , అంప శయ్య మీద వున్న భాష కు కొంత ఊపిరి పోద్దాం…
పిల్లలతో సంభాషించి నపుడు, మిత్రులతో, శుభకార్యాలలో గర్వంగా తెలుగు భాషలో సంభాషించండి. దిక్కుమాలిన దూరదర్శిని (TV) వ్యాఖ్యాతల, ప్రకటనల, ధారావాహికల్లో , నూతన సినిమాల్లో వాడే భాష అనుకరించడం మానండి. పాత సినిమాలు మిత్రులతో, సకుంటంబంతో ముఖ్యంగా పిల్లలతో కలిసి వీక్షించండి (చూడండి).. పాతసిమాలు చూసే అలవాటు వలన భాషే కాదు మన సంస్కృతిలోని ఎన్నో మంచి పద్దతులు, కట్టుబాట్లు, మన ఆచార వ్యవహారాలు పిల్లలకు నేర్పించిన వారమౌతాము.

ఒక్కటి గుర్తుంచుకోండి… ఎంత ఆర్థిక దారిద్ర్యంవున్నా, భాషా, సాంస్కృతిక సంపద, మన ఆచారవ్యవహారాలతో పెంచిన పిల్లలు అలా గడిపే జీవనం, మల్లెపూలలాంటి పరిమళాన్ని ఇస్తుంది. ఎంత ధనం ఆర్జించినా ఆర్థికంగా, విలాసాలపరంగా ఎంత ఉచ్చస్థితికి ఎదిగినా భాషా, సాంస్కృతిక మూలాలు పోయిన జీవనం వాసనలేని కాగితపు పూలతో సమానం అని గుర్తుంచుకోండి

భాషయు దూరమయ్యే , పరభాషయే మీప్రియభామయయ్యే ఇం
గ్లీషును మాధ్యమమ్ముగా వరించిరి, అద్దియటుండనిండు, సం
భాషణకైనా చెల్లదొకో! పద్యమనోహరమైనభాష, స్వ
ర్భాషకు తుల్యభాష, పదబంధ సుగంధమయాంధ్రభాషయే

LEAVE A RESPONSE