రాంనగర్ శివ పంచాయతన శ్రీ ఆంజనేయ స్వామి వన గ్రహ దేవతా సహిత ధ్వజ శిఖర బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్, మే 3ః సిఎం కెసిఆర్ హయాంలోనే పురాతన దేవాలయాలకు సైతం పూర్వ వైభవం వచ్చిందని, ధూప దీప నైవేద్యాలకు నోచుకుంటూ, అనేక దేవాలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ జరుగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్ గ్రామంలో జరిగిన రాంనగర్ శివ పంచాయతన శ్రీ ఆంజనేయ స్వామి వన గ్రహ దేవతా సహిత ధ్వజ శిఖర బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి, స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మార్నేని రవిందర్ రావు, ప్రభుత్వ న్యాయవాది తక్కళ్ళపల్లి శ్యాం సుందర్ రావు, సర్పంచ్ బోయినపల్లి శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.