2023లో కేంద్ర హోమ్ మంత్రి శ్రీమాన్ అమిత్ షాహ్ రెండేళ్లలో “నక్సలిజమ్ను పూర్తిగా నిర్మూలిస్తాం” అని చెప్పారు. ఆ మేరకు దృఢ సంకల్పంతో ఒక బాధ్యతాయుతమైన ప్రజా ప్రభుత్వ హోమ్ మంత్రిగా చిత్త శుద్ధితో పనిచేస్తున్నారు ఆయన. ఈ 2025లో దేశంలో దాదాపుగా నక్సలిజమ్ నిర్మూలనం అవుతున్న దశ వచ్చేసింది! చాల సంతోషకరమైన పరిణామం ఇది.
రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ ప్రభుత్వం చేసిన పూర్వ పాలకులు మొదట్లోనే చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే దేశంలో నక్సలిజమ్ దారుణాలకు లక్షలాది మంది సామాన్యుల బతుకులు రక్షించబడేవి. వేలాది తల్లుల కడుపుకోతలు లేకుండా ఉండేవి; ఎన్నెన్నో కుటుంబాలు ధ్వంసమయిపోకుండా ఉండేవి; అమాయకుల కన్నీరు, రక్తం బుగ్గిపాలు కాకపోయేవి.
తమిళ్ష్నాడు మాజీ ముఖ్యమంత్రి మాననీయ ఎమ్.జీ. రామచంద్రన్ తన రాష్ట్రంలో వేళ్లూనుకోనున్న నక్సలిజాన్ని తొట్టతొలి దశలోనే చిత్తశుద్ధితో సమూలంగా నిర్మూలించేశారు. ఆ చిత్తశుద్ధి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఉండుంటే మన తెలుగ ప్రజలు నక్సలిజానికి ఈ మేరకు బలై ఉండేవారు కాదు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ వాళ్లు. ఇంక తెలుసుకునేదేముంది? కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కాలం కాబ్టటే ఆంధ్రలో నక్సలిజమ్ దాష్టీకంగా బలపడింది.
దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగునాట నక్సలిజమ్ పుంజుకున్నట్టుగా కేరళలో, కర్ణాటకలో, తమిళ్ష్నాడులో జరగలేదు. కారణం ఏమిటి? ‘మలయాళీలు, కన్నడిగులు, తమిళ్షులకు ఉన్న బుద్ధి, ఆలోచన, విజ్ఞత, మనో వికాసం తెలుగు ప్రజకు లేకపోవడం’ అని అవగతం చేసుకోవడం ఎంత మాత్రమూ తప్పుకాదు; ఏ దోషమూ కాదు.
ఆ ‘బుద్ధి, ఆలోచన, విజ్ఞత, మనో వికాసం లేకపోవడం’ కారణంగా ఇవాళ్టి ఈ నా మాటలకు అసభ్య పదజాలంతో వీధి జాగిలాలకు పుట్టిన కొందరు తమ జన్మ రహస్యాన్ని తెలిపే భాషను నాపై ప్రయోగించవచ్చు; ఈ విషయంగా తమ ఉన్మాద వ్యాధిని నాపై ప్రయోగించవచ్చు. అందువల్ల నిజాలు నిర్మూలనమవవు; భవిష్యత్ ప్రగతి ఆగిపోదు.
ప్రపంచంలో ఏ భాషలోనూ జరగని విధంగా కమ్యూనిజానికి తెలుగు కవిత్వం, సాహిత్యం బలైపోవడానికి కారణం కూడా తెలుగు మేధావులకు (ప్రజలకు కాదు) మామూలు ‘బుద్ధి, ఆలోచన, విజ్ఞత, మనో వికాసం లేకపోవడమే’.
విధ్వంసం… విధ్వంసం… నక్సలిజమ్ దేశంలో చేసింది ఏమైనా ఉందంటే అది విధ్వంసం మాత్రమే.
నక్సలిజమ్ అది కమ్యూనిజమ్ లాగానూ, కమ్యూనిజమ్ జనితమూ అయిన ఒక మానసిక రోగం. నక్సలిజమ్, కమ్యూనిజమ్ రెండూ నిర్మూలనమవడమే ఆ భయంకర విధ్వంసకర రోగాలకు పరిష్కారం.
స్వతంత్ర భారతదేశాన్ని స్వతంత్ర భారత ప్రజానీకాన్ని తీవ్రంగా దెబ్బతీసిన ఏవి?
1. కాంగ్రెస్
2. కమ్యూనిజమ్
3. నక్సలిజమ్
3. విదేశీ మతోన్మాదం
4. రిజర్వేషన్స్
5. రుద్దబడిన సెక్యూలరిజమ్
6. పాత్రికేయం
8. ఉదారవాదం
(ఈ మాటలకూ వీధి జాగిలాల సంతానం నాపై దుర్భాష ప్రయోగంతో తమ జన్మలు అతి వికృతమైనవి అని బహిరంగంగా నిరూపించుకుంటాయి)
ఇవి అష్ట దరిద్రాలలా లేదా అష్ట శాపాలలా మనదేశాన్ని పట్టాయి. “చైనాలా మనదేశం అభివృద్ధి కాలేదేం” అని ప్రశ్నించే బుద్ధి మాంద్యానికి ఆ చైనాకు ఈ అష్ట శాపాలు తగల్లేదు. (చైనా కమ్యూనిజమ్ మనదేశ కమ్యూనిజమ్ వేరువేరు) ఈ ఎనిమిదీ లేకపోయుంటే ఇప్పటికే మనదేశం అమేరికను మించిన అగ్రదేశం అయుండేదేమో కాదు అయుండేది!
ఉన్మాదానికి, దౌష్ట్యానికి, మానసిక రోగాలకు, వంచనకు, తప్పుడుతనానికి, దగుల్బాజీతనానికి, దుర్మార్గపు పాత్రికేయానికి అతీతంగా మనను దెబ్బకొట్టిన అంశాలపై మనకు వాస్తవాధారిత అవగాహన అత్యవసరం.
‘బుద్ధితో, ఆలోచనతో, విజ్ఞతతో, మనో వికాసంతో మనం మనకు తగిలిన దెబ్బలు, సోకిన వ్యాధుల గురించి అవగాహనను సాధించాలి. దెబ్బతిన్నది చాలు; ఇక పుంజుకోవాలి.
కేంద్ర ప్రజా హోమ్ మంత్రి పూనికతో దేశంలో నక్సలిజమ్ అంతమౌతున్న శుభ తరుణం ఇది. అందుకు అమిత్ షాహ్ గారికి మనసా, వాచా కృతజ్ఞత.
మనను దెబ్బకొడుతున్న ఆ ఇతర శక్తులు కూడా నిర్మూలనమయ్యేందుకు మనవంతు కృషి చేస్తూ మనం భారతదేశాన్ని అగ్రేసర దేశం చేసుకోవాలి.

9444012279