ఒక సాయం నిలబెడుతుంది. ఒక ప్రోత్సాహం గెలిపిస్తుంది. ఇచ్చే ఆ సాయం పేరే సీబీఎన్, ఆ ప్రోత్సాహమే చంద్రబాబు. టిడిపి ప్రభుత్వ హయాంలో విభిన్న ప్రతిభా వంతుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో విభిన్నప్రతిభావంతులు డ్రైవ్ చేయడానికి వీలుగా రూపొందించిన 2 వేల స్కూటర్లు, మోటరైజ్డ్ వాహనాలు ఉచితంగా అందజేశారు. వీటి రిజిస్ట్రేషన్ కూడా ఉచితమే. తమకు ఆసరాగా నిలిచి, చేయూత అందించిన అప్పటి సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పేందుకు విభిన్న ప్రతిభావంతుల వాహనాలపై “థ్యాంక్యూ సీఎం సార్“ అని రాయించుకున్నారు. యువగళం పాదయాత్ర శింగనమల రాగా, విభిన్న ప్రతిభావంతులు వచ్చి యువనేత లోకేష్ కి సంఘీభావం ప్రకటించారు.