యువగళం పాదయాత్రలో వైసీపీ ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అని లోకేష్ అనడం అక్షర సత్యం

-యువగళం ముగింపు సభను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు
– రాష్ట్రంలోని కోటి మంది దళితుల్లో మాకొద్దు ఈ జగన్ అని నినదించడానికి లక్షలాదిమంది దళితులు యువగళం ముగింపు సభకు వచ్చారు
-యువగళం ముగింపు సభలో టీడీపీ జనసేన మిళితాన్ని అందరూ ఆశీర్వదించడంతో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

విజయగరం జిల్లా పోలీపల్లిలో జరిగిన యువగళం ముగింపు సభ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు ..

యువగళం ముగింపు సభ జగన్ పాలనకు చరమగీతం పాడింది. ఈ సభకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. టీడీపీకి, చంద్రబాబుకు, లోకేష్, పవన్, ఆయన బృందానికి లక్షలాదిమంది ప్రజలు జేజేలు పలికారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. యువగళం ముగింపు సభకు ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టించింది. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇవ్వడానికి నిరాకరించింది. సొంత బస్సులు ఏర్పాటు చేసుకుంటే.. ప్రైవేటు బస్సుల్లో వెళ్లడానికి వీల్లేదన్నారు. అయినా మా సొంత ఏర్పాట్లు మేం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశాం.

స్వాతంత్ర్య సమర సమయంలో బ్రిటీష్ కర్కషులు ఏ విధంగా స్వాతంత్ర్య సమరయోధుల్ని అడ్డుకున్నారో అలా ఉంది. స్వాతంత్ర్య సమర సమయంలో బ్రిటీష్ కర్కషులు ఏ విధంగా స్వాతంత్ర్య సమరయోధుల్ని అడ్డుకున్నారో అలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఆ విధంగా ఈ నిరంకుష పు నేటి వైసీపీ ప్రభుత్వం సభకు వచ్చేవారిని అడ్డుకుంది. స్వచ్ఛా వాయువుల్ని అందించే, ప్రజాస్వామ్య పరిపాలన అందించే, రాజ్యాంగపరమైన పరిపాలన అందించే తెలుగుదేశం పార్టీకి అనేక ఆటంకాలు సృష్టించారు.

లోకేష్ అంటే జగన్ కు ఎందుకింత భయం. లోకేష్ పాదయాత్రలో ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు, కలిసి కదంతొక్కారు. లోకేష్ తన పాదయాత్రలో 3,123 కిలోమీటర్లు నడిచారు. 226 రోజులు తన నడక కొనసాగించారు. 97 నియోజకవర్గాల్లో పర్యటించారు. చిన్నా చితక, పిల్లలు, వయోవృద్ధులు ఆయనతో కదం కదం కలిపి నడిచారు. ఆయన వారి బాధల్ని అర్థం చేసుకున్నారు. నవశకానికి ఒక నాంది పలికారు.

యువగళం ముగింపు సభలోని లోకేష్ మాటలు జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి
యువగళం ముగింపు సభలోని లోకేష్ మాటలు జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి మా యువనేత లోకేష్ జగన్ ప్రభుత్వానికి 90 రోజులు అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం హయాంలో జగన్ పాదయాత్ర చేస్తే కించిత్తైనా ఇబ్బంది కలుగకుండా చూశాం. అయితే వైసీపీ ప్రభుత్వం ఎందుకు లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించింది? అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వాన్ని ఈసడించుకుంటున్నారు. జగన్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరు. అసత్యాలు చెప్పి, అసాధ్యపు వాగ్దానాలు చేసి, దళిత వర్గాలను నా మేనమామలు మీరు అని మోసం చేశారు. జగన్ కు క్రైస్తవత్వం ఉందో లేదో తెలియదుగానీ బైబిల్ పట్టుకొని తిరిగి మరీ వాగ్దానాలు చేశారు.

మతాలను కూడా జగన్ క్షుద్ర రాజకీయాల్లో జోడించి అధికారంలోకి వచ్చారు
మతాలను కూడా జగన్ క్షుద్ర రాజకీయాల్లో జోడించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక వ్యవహరించిన తీరు ఏమీ బాగలేదు. దళితుల్ని ఇనుప పాదాల కింద వేసి తొక్కారు. రాష్ట్రంలోని కోటి మంది దళితుల్లో మాకొద్దు ఈ జగన్ అని నినదించడానికి లక్షలాదిమంది దళితులు లోకేష్ ముగింపు సభకు వచ్చారు. బీసీ వర్గాలకు పెట్టిన క్షోభ అంతా ఇంత కాదు. మా అక్కను అల్లరి చేయొద్దన్న బీసీ యువకుడిని పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి నిజంకాదా?

బీసీలందరూ టీడీపీ, చంద్రబాబువైపు మద్దతిస్తూ పరుగులు తీస్తున్నారు. మైనార్టీలు మాకొద్దు ఈ జగన్ పరిపాలన అంటున్నారుర. కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం వైసీపీ కర్కష మూక పెట్టిన ఇబ్బందులతో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదు. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి మోసపోయామని రైతులంటున్నారు. రైతులు భూమిపై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే జగన్ ఆకాశంలో హెలిక్యాప్టర్ లో చక్కర్లు కొట్టారు. మహిళలు ఏదో చేస్తారని ఓట్లేస్తే వారిని నిండా ముంచారు. అమ్మ ఒడి ద్వారా డబ్బులిచ్చి నాన్న బుడ్డి ద్వారా లాక్కుంటున్నారని జనం గ్రహించారు.

యువగళం ముగింపు సభలో టీడీపీ జనసేన మిళితాన్ని అందరూ ఆశీర్వదించడంతో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి
యువగళం ముగింపు సభలో టీడీపీ జనసేన మిళితాన్ని అందరూ ఆశీర్వదించడంతో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. లిక్కర్ రేట్లు పెంచి, నాసిరకం సారా అందించి అనేక మంది తెలుగు మహిళల పుస్తెలు తెంచారు. మహిళందరూ మాకొద్దు ఈ జగన్ అంటున్నారని యువగళం ముగింపు సభకు వచ్చిన మహిళలను బట్టి తెలుస్తోంది. అందరినీ సమ దృష్టితో చూసే చంద్రబాబే మాకు కావాలంటున్నారు. ఆయన పాలనే మాకు శ్రీరామ రక్ష అంటున్నారు.

పవన్, చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, అచెన్నాయుడు, అందరికీ తోడుగా బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సభలో మీ ప్రభుత్వానికి తిలోదకాలిస్తూ, ప్రజలందరితో సాగిన విధానం నభూతో నభవిష్యత్ లా జరిగింది. జనసేనతో మిళితమైన తెలుగుదేశం పార్టీనే మాకు కావాలంటున్నారు. సితారా వేడుకల్లో కవేసే డ్యాన్సులను తలదన్నేలా లోకేష్ యువగళం ముగింసు సభలో డ్యాన్సులు చేశారు. టీడీపీ నాయకులు అనుకున్నదానికంటే ఎక్కువ సంఖ్యలో జనం హాజరై అబ్బురపరిచారు. యువగళం ముగింపు సభలో టీడీపీ జనసేన మిళితాన్ని అందరూ ఆశీర్వదించారు. సభకొస్తుంటే ఓవర్ లోడ్ కేసులు పెట్టి జనాన్ని భయపెట్టారు. నిన్నటి సభతో వైసీపీ నాయకులు కిమ్మనకుండా ఉన్నారు. ప్రతిదానికి ఎగిరెగిరి మాట్లాడే రోజాలాంటివారు నోరు మెదపలేదు.

వైసీపీ నాయకులు పలాయనం చిత్తగించే రోజు దగ్గరలోనే ఉంది
వైసీపీ నాయకులు పలాయనం చిత్తగించే రోజు దగ్గరలోనే ఉంది. లోకేష్ అద్భుతమైన ప్రసంగంతో ప్రజలందరూ మంత్రముగ్దులయ్యారు. జగన్ తిరోగమన దిశలో ఉన్నారని అధికారులకు కూడా అర్థమైపోయింది. ఈ కర్కష పరిపాలనకు ప్రజలు స్వస్తి పలకాలి. నిన్నటి సభ యువత భవితకు భరోసా కల్పించింది. వైసీపీ రాక్షస పాలనకు ముగింపు పలికినట్లు ఈ సభలో కన్పించింది. టీడీపీ జనసేన పొత్తు ప్రకటన నుంచి వైసీపీ నేతలకు నిద్రపట్టడం లేదు. ఇక నిన్నటి సభ విజయవంతంతో తాడేపల్లి ప్యాలెస్ కి పగుళ్లు ఏర్పడ్డాయి.

అందుకే జగన్ రెడ్డి, వైసీపీ నేతలు ఓటమి భయంతో వణికిపోతున్నారు. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్.. ఇక జగన్ సినిమా అయిపోయిందని ప్రజలే అంటున్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి, టీడీపీ జనసేన కూటమికి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. టీడీపీ జనసేన తప్పక అధికారంలోకి వస్తుంది, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

Leave a Reply